టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో సుధీర్‌వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 18న వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్‌లో సుధీర్.. విషం తాగారు. వెంటనే కొండాపూర్‌లోని ఆస్పత్రికి ఆయనను తరలించారు. ఈ నెల 19 వరకు అక్కడే చికిత్స పొందారు. అయితే గత శుక్రవారం.. విశాఖ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున మరణించారు.
టాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య - kundanapu bomma sudheer varma died
టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డినట్లు సుధీర్ కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, రాఘవేంద్ర రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు సుధీర్. ఇంకా సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ నటించారు. సుధీర్ మృతి విషయాన్ని కుందనపు బొమ్మ' సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. సుధీర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇదీ చూడండి:ఈ వారమే షారుక్ 'పఠాన్'.. ఇంకా ఏఏ సినిమాలు సందడి చేయనున్నాయంటే?