సంక్రాంతి సందర్భంగా విడుదలైన అగ్రతారల సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు అంతగా విడుదల కాలేదు. కానీ కొందరు కుర్ర హీరోలు సందడి చేశారు. కాగా, టాలీవుడ్.. మార్చి వేసవి సినీ మారథాన్‌కు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ ముందు అగ్ర కథానాయకులు వరుస కట్టాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వారి చిత్రాలన్నీ షూటింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈ పెద్ద సినిమాలు కొన్ని ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో విడుదలకు ప్లాన్ చేయగా.. మరికొన్ని సమ్మర్, సంక్రాంతిపై కన్నేశాయి. అందుకు తగ్గట్లుగానే సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. అయితే ఇప్పటికే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ కొత్త షెడ్యూల్లో షూటింగ్ ప్రారంభించారు. ఇక వెంకటేశ్, నాగార్జున, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు మార్చిలో రంగంలోకి దిగనున్నారు.
వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున శరవేగంగా మహేశ్ సినిమా..
ఇటీవలే కుటంబంతో కలిసి ఫారెన్ ట్రిప్‌నకు వెళ్లొచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఆయన 28వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగర శివార్లలో వేసిన ఖరీదైన ఇంటి సెట్లో మహేష్, పూజా, శ్రీలీలతో పాటు మిగిలిన ప్రధాన నటీనటులపై కుటుంబ నేపథ్య సీన్స్ తీస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు సమాచారం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది.
'ఖుషి'గా సమంత..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఖుషి'.. ఇప్పటికే విడుదల కావాల్సింది. హీరోయిన్ సమంత ఆనారోగ్యంగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. ఇక, మార్చి 8 నుంచి సమంత రెగ్యులర్ చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ జవాన్‌గా కనిపించనున్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
బాలకృష్ణ వినోదం..
నటసింహ నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమా.. మార్చి ఫస్ట్ వీక్‌లో మరో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. కాగా, ఇదే వారంలో హీరో నాగార్జున కొత్త చిత్రం కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ డైరెక్ట్ చేస్తున్న మొదటి చిత్రం ఇది. అయితే, మార్చి మార్చి ఫస్ట్ వీక్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. నెల మధ్య నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించనుంది. ఇక ఈ మూవీ నాగార్డున సరసన మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఆడిపాడనుంది. ఈ సినిమాలు ప్రముఖ హీరో నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఎన్టీఆర్, వెంకటేశ్ జోరు..
ఇక, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా - కొరటాల శివ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం కూడా మార్చిలోనే ప్రారంభం కానుంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. దీంతో మార్చి 18న ప్రారంభమై.. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది సినిమా యూనిట్. ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక మరో అగ్ర నటుడు విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కితున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ మూవీ.. తర్వలో సెట్స్‌పైకి వెళ్లనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు హీరో ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.