Tollywood top heroes: అగ్ర తారలు వరుసగా కొత్త సినిమాల కబుర్లు వినిపించనున్నారు. కరోనావల్ల ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వచ్చిన సినిమాల విడుదలల గురించే మొన్నటి వరకూ ఎదురు చూశాం. కీలకమైన ఆ సినిమాలన్నీ ఒకొక్కటిగా విడుదలవుతూ వచ్చాయి. ఇక నుంచి కొత్త అధ్యాయాలు మొదలు కానున్నాయి. జూన్‌లోనే పలువురు అగ్ర కథానాయకులు సినిమాలకు కొబ్బరికాయ కొట్టనున్నారు.
ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న సినిమా పనులు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఎన్టీఆర్‌పై ఇటీవలే ఫొటోషూట్ చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజైన 20న ఆ సినిమాకి సంబంధించిన కొత్త కబురు వినిపించనున్నారు. హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.