టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. ఆయన సతీమణి తేజస్విని జూన్ 29న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కొడుకు పుట్టిన ఆనంద క్షణాలను దిల్‌రాజు మనసారా ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా దిల్‌రాజు తన కొడుక్కి 'అన్వయ్ రెడ్డి' అనే పేరును కన్ఫర్మ్ చేశారట.
ఈ పేరును పరిశీలించే క్రమంలో దిల్‌రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన మొదటి భార్య పేరు కలిసిలా.. తన కొడుకు పేరు పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దిల్‌రాజు మొదటి భార్య పేరు అనిత. అమె మీద ఉన్న ప్రేమను తెలిపేలా.. 'అన్వయ్ రెడ్డి' పేరు పెట్టే యోచనలో ఉన్నారట దిల్‌రాజు. అయితే అతి త్వరలోనే తన కుమారుడి పేరును అధికారికంగా ప్రకటనించనున్నారు దిల్‌రాజు.