తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరోసారి తండ్రైన దిల్​రాజు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని - దిల్​రాజు వార్తలు

టాలీవుడ్​ స్టార్​ ప్రొడ్యూసర్​ దిల్​రాజు మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని మగబిడ్డకు జన్మనిచ్చారు. దిల్​రాజు దంపతులకు పలువురు సినీ ప్రముఖులు సోషల్​ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మొదటి భార్య మరణాంతరం 2020లో వరంగల్​కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు.

దిల్​ రాజు
దిల్​ రాజు

By

Published : Jun 29, 2022, 12:03 PM IST

Updated : Jun 29, 2022, 12:24 PM IST

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో 2017లో కన్నుమూశారు. వీరికి హన్సితా రెడ్డి అనే కుమార్తె ఉంది. మొదటి భార్య మరణానంతరం ఆయన వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో 2020లో వీరి వివాహం జరిగింది.

ఇక, సినిమాల విషయానికి వస్తే దిల్‌రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి విజయ్‌-వంశీపైడిపల్లి కాంబోలో రానున్న 'వారసుడు'. మరొకటి రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం.

ఇదీ చూడండి :రామ్​చరణ్​ ఇంటికి బాలీవుడ్ స్టార్స్ క్యూ.. ఏంటి కథ?

Last Updated : Jun 29, 2022, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details