తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పెన్​తో మొదలైన దిల్​ రాజు ప్రేమ కథ.. ప్రియసఖిగా మారిన గగనసఖి - దిల్​ రాజు సినిమాలు

'వారసుడు' హిట్​తో జోష్​ మీదున్న టాలీవుడ్​ స్టార్​ ప్రొడ్యూసర్​ దిల్​ రాజు తన రెండో పెళ్లి ఎలా జరిగిందో చెప్పారు. తమ లవ్​ స్టోరీ గురించి వివరించారు. ఆ సంగతులు..

dil raju love story
dil raju

By

Published : Jan 17, 2023, 1:46 PM IST

Updated : Jan 17, 2023, 2:04 PM IST

తన మొదటి భార్య చనిపోయిన మూడేళ్ల తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్​ దిల్​ రాజు.. 2020లో వైఘా రెడ్డి అలియాస్​ తేజస్విని అనే యువతిని అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు. అయితే ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు ఈ స్టార్​ ప్రొడ్యూసర్​. అసలు ఆయన భార్య తన 'దిల్​'ను ఎలా దోచుకుందో తెలిపారు.

"అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాలు అనుభవించాను, అప్పటికే నాకు 47 ఏళ్లు, జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలనుకుంటున్న సమయంలో రెండు మూడు ఆప్షన్స్ వచ్చాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అలా నాకు తేజస్విని పరిచయమైంది. ఎయిర్​ హోస్టెస్​గా ఉన్న తేజస్వీ నేను ప్రయాణం చేసే విమానంలో తరచూ కనిపించేది. ఆమె నాకు నచ్చడంతో ఫోన్ నెంబర్ తీసుకుని దాదాపు ఏడాది పాటు తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. ఆ తర్వాత ప్రపోజ్ చేశాను. తను ఓకే చెప్పడంతో ఇంట్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించా" అని దిల్ రాజు చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన తేజస్విని కూడా తన ప్రేమ కథను తెలిపారు."ఆయన యూఎస్​కి వెళ్లే విమానంలో తరచూ కనిపించేవారు. మొదట నన్ను ఆయన పెన్ను అడిగారు. తర్వాత అలా అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఒకసారి నా ఫోన్ నంబర్ తీసుకున్నారు." అలా వీరిద్దరి జర్నీ స్టార్ట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. అయితే తేజస్వినికి వివాహానికి ముందు సినిమాల అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదట. వీరిద్దరూ ప్రేమలో పడ్డాక గూగుల్‌లో చూసి దిల్ రాజు దర్శకుడు కాదు నిర్మాతని తెలుసుకున్నారట. కాగా తాజాగా దిల్​ రాజు ప్రొడక్షన్​ హౌస్​ తెరకెక్కించిన దళపతి విజయ్​ వారసుడు సినిమా అటు తెలుగులో, ఇటు తమిళంలోనూ బాక్సాఫీస్​ దగ్గర మంచి వసూళ్లను అందుకుంటోంది. మరోవైపు శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్​సీ 15కు దిల్​ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Last Updated : Jan 17, 2023, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details