తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​-ప్రశాంత్​ కాంబో రిపీట్​.. 'సలార్​' కంటే.. - ప్రశాంత్​ నీల్​ ప్రభాస్​ కాంబో

సలార్​ సినిమాతో టాలీవుడ్​లో సెన్సేషన్​గా నిలుస్తున్న ప్రశాంత్​- ప్రభాస్​ కాంబో త్వరలోనే ఓ కొత్త సినిమాకు సైన్​ చేయనుందట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్​రాజు తెలిపారు. ఇక ఈ వార్త విన్న డార్లింగ్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

Prasanth neel prabhas
Prasanth neel prabhas

By

Published : Apr 12, 2023, 2:37 PM IST

Updated : Apr 12, 2023, 3:08 PM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఇప్పటికే సలార్​ అనే సినిమా సెట్స్​పై రన్​ అవుతోంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో.. డార్లింగ్​ ఫ్యాన్స్‌ కోసం నిర్మాత దిల్‌ రాజు ఓ అదిరిపోయే అప్డేట్​ ఇచ్చారు. 'సలార్‌' తర్వాత ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో మరో సినిమా త్వరలోనే తీయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

"త్వరలోనే ప్రభాస్‌ ప్రశాంత్‌ నీల్ కాంబోలో ఓ పౌరాణిక సినిమా రానుంది. ఇక దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా రెడీ అయ్యింది. అయితే ప్రస్తుతం వీళ్లిద్దరూ 'సలార్‌'తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీయనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక ప్రభాస్‌ సినిమా మొదలవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది" అని అన్నారు. ఇక ఈ వార్త విన్న ప్రభాస్​ ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్​ అవుతున్నారు.

మరోవైపు 'సలార్‌' టీజర్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ టీజర్‌ జూన్‌లో విడుదలవ్వనున్నట్లు సినీ వర్గాల టాక్​. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ అంతా కూడా పూర్తయిందని అంటున్నారు. ఇక ప్రభాస్‌ అప్​కమింగ్​ మూవీ 'ఆదిపురుష్‌' విడుదలైన వెంటనే ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారని టాక్‌. అంతే కాకుండా టీజర్‌లోనే సినిమా కాన్సెప్ట్‌ను చూపనున్నారని సమాచారం. ఇంకా ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇక ప్రభాస్​ అప్​కమింగ్​ సినిమాల విషయానికి వస్తే.. బాహుబలి పార్ట్​ 2 సినిమా రిలీజ్​ తర్వాత.. 2022లో 'రాధే శ్యామ్'​ అనే సినిమాలో నటించిన ప్రభాస్​.. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్​ను గడుపుతున్నారు​. ఇప్పటికే కేజీఎఫ్​ ఫేమ్ దర్శకుడు​ ప్రశాంత్​ నీల్​ తెరకెక్కిస్తున్న 'సలార్'​ షూటింగ్​లో ఉన్న ఈ స్టార్​.. ఈ సినిమాతో పాటు నాగ్​ అశ్విన్​ 'ప్రాజెక్ట్​ కే' చిత్రీకరణలో బిజీగా ఉంటున్నారు. అంతే కాకుండా టాలీవుడ్​ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఓ సినిమాకు కూడా సైన్​ చేశారు. ప్రస్తుతం ఆ సినిమా కూడా షూటింగ్​ దశలో ఉంది. మరోవైపు ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలోనూ నటించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్'​ సినిమాలో రాముని పాత్రలో కనిపించారు. ఇక 'అర్జున్​ రెడ్డి' సినిమా దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్​' అనే సినిమాకు కుడా ప్రభాస్​ సైన్​ చేశారు.

Last Updated : Apr 12, 2023, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details