తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రోడ్డు ప్రమాదంలో శర్వానంద్​కు గాయాలు?.. ఇదిగో క్లారిటీ! - sharwanand range rover accident

హీరో శర్వానంద్‌ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాన్న వార్తలు ప్రచారంలో ఉన్న వేళ స్వయంగా శర్వానంద్​ టీమ్​ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

sharwanand injured in road accident
sharwanand injured in road accident

By

Published : May 28, 2023, 10:51 AM IST

Updated : May 28, 2023, 12:24 PM IST

Sharwanand Accident : హీరో శర్వానంద్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. తొలుత శర్వానంద్‌కు గాయాలైనట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్‌ మేనేజ్​మెంట్​ టీమ్​ తెలిపింది. కారుకు చిన్నపాటి గీతలు పడ్డాయని అంతకు మించి కారులో ఉన్న ఎవరికి గాయం కాలేదని టీమ్​ పేర్కొంది. ఇది చాలా స్వల్ప ఘటన అని.. కారులోని అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది.

Sharwanand Marriage : మరోవైపు జనవరిలో నిరాడంబంగా ఎంగేజ్మెంట్​ చేసుకున్న శర్వానంద్, రక్షితల జంట ఈ ఏడాది జూన్ 3న రాత్రి జైపుర్​లో వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. జైపుర్​లోని లీలా ప్యాలెస్​లో ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. జూన్ 2న మెహందీతో పాటు ఇంకొనన్ని ఫంక్షన్లను ఘనంగా నిర్వహించనున్నారు. కాగా ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం. ఈ ప్యాలెస్‌లో పెళ్లి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే సోషల్‌ మీడియా సహా పలు వెబ్​సైట్ల కథనం ప్రకారం.. సదరు ప్యాలెస్‌లో ఒక్క రోజుకు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. అంటే మొత్తంగా ఈ రెండు రోజల పెళ్లికి అన్ని ఖర్చులతో కలిపి రూ.10కోట్లు మేర ఖర్చు కానుందని సమాచారం.

శర్వానంద్​ రక్షిత

Sharwanand Movies list : ఇక శర్వానంద్​ సినిమాల విషయానికి వస్తే.. ​ ఇటీవలే 'ఒకే ఒక జీవితం' అనే పీరియాడికల్​ డ్రామాలో నటించారు. అమల, వెన్నెల కిశోర్​ లాంటి స్టార్స్​ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ అందుకోవడమే కాకుండా విశ్లేషకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన మరి కొన్ని ప్రాజెక్టులకు సైన్​ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ మూవీ 'హృదయం' ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు మాస్ ​మహారాజా రవితేజతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా కూడూ సైన్​ చేశారని టాక్​. ఇందులో లెక్చరర్​గా రవితేజ, ఆయన స్టూడెంట్​గా శర్వానంద్ కనిపిస్తారట. 'కలర్ ఫోటో' ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.

ఒకే ఒక జీవితంలో శర్వానంద్​
Last Updated : May 28, 2023, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details