తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Nikhil Swayambhu : పాన్ ఇండియా మూవీగా నిఖిల్​ 20.. యుద్ధభూమిలో.. - నిఖిల్ పోస్టర్

Nikhil New Movie : తన బర్త్​డే సందర్భంగా ఓ నయా ప్రాజెక్ట్​ను అనౌన్స్​ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు టాలీవుడ్​ హీరో నిఖిల్ సిద్ధార్థ. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్​ను చాలా అట్రాక్టివ్​గా ఉందని అభిమానులు అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ?

nikhil swayambhu
nikhil swayambhu

By

Published : Jun 2, 2023, 6:57 AM IST

Updated : Jun 2, 2023, 10:41 AM IST

Nikhil 20 Movie : టాలీవుడ్ స్టార్ నిఖిల్​ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రామ్​చరణ్​ నిర్మాణంలో వస్తున్న ద ఇండియా హౌస్​తో పాటు స్పై సినిమాలకు సైన్ చేసిన ఆయన ఇప్పుడు తన 20వ సినిమా గురించి ఓ క్రేజీ అనౌన్స్​మెంట్​ ఇచ్చారు. తన బర్త్​డే సందర్భంగా మూవీ టీమ్​ రిలీజ్​ చేసిన పోస్టర్​తో ఫ్యాన్స్​ను సర్ప్రైజ్​ చేశారు. అందులో ఆయన యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతున్న యోధుడిలా కనిపించారు.

భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'స్వయంభూ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్​ను చూస్తుంటే ఇదొక సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినదని అర్థం. ఇందులో నిఖిల్​ పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం, మరొక చేతిలో డాలుతో సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు. ఆయన గెటప్, మేకోవర్ కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క లుక్​తోనే సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి అంటూ సోషల్​ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఇది నిఖిల్‌కు 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న చిత్రమిది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్​ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది అని సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్‌ మ్యూజిక్​ను అందిస్తున్నారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు.

నిఖిల్​ ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉన్నారు. అసిస్టెంట్​ డైరెక్టర్​గా కెరీర్​ను ప్రారంభించిన నిఖిల్​.. 'హ్యాపీడేస్'​ సినిమాతో సినీ తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్​కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆయన ఆ తర్వాత యూత్​ రిలేటడ్​ రోల్స్​లో కనిపించారు. అలా వరుస సినిమాలు చేసినప్పటికీ అవన్నీ బాక్సాఫీస్​ వద్ద అంతగా ఆడలేదు. నటుడిగా తనకు మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టలేదు. దీంతో ఫామ్ కోల్పోయిన నిఖిల్​కు 2014లో వచ్చిన 'కార్తికేయ' హిట్​తో బ్రేక్​ వచ్చింది.​ ఆ సక్సెస్​ను ఆస్వాదిస్తూ ఈ యంగ్​ హీరో.. ఆ తర్వాత అవకాశాలను అందిపుచ్చుకుని మంచి నటుడిగా ప్రేక్షకులను చేరువయ్యారు. అప్పటి వరకు సౌత్​ స్టార్స్​కు పోటీ ఇస్తూ వచ్చిన నిఖిల్​.. 2022లో చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ 2'తో నార్త్​ ప్రేక్షకులకు పరిచమై అక్కడి బాక్సాఫీస్​లను సైతం షేక్ చేశారు. దీంతో ఈయనతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో మరోసారి ఆడియన్స్​ను అలరించేందుకు ముందుకు రానున్నారు.

Last Updated : Jun 2, 2023, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details