తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ.100 కోట్ల బడ్జెట్ సినిమా ప్రకటించిన మోహన్​ బాబు.. వర్కౌట్ అవుతుందా? - మోహన్​ బాబు ప్రొడక్షన్​ హౌస్​

Mohan Babu Rs 100 Crore Film : టాలీవుడ్​ విలక్షణ నటుడు మోహన్​ బాబు త్వరలో ఓ భారీ బడ్జెట్​తో సినిమా రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆ వివరాలు..

Mohan Babu Rs 100 Crore Film
Mohan Babu Rs 100 Crore Film

By

Published : Jun 1, 2023, 2:25 PM IST

Updated : Jun 1, 2023, 4:35 PM IST

Mohan Babu Rs 100 Crore Movie : టాలీవుడ్‌ స్టార్​ హీరో, డైలాగ్ కింగ్​ మోహ‌న్ బాబు ప్రస్తుతం అప్పడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. గతంలో వచ్చిన సన్​ ఆఫ్​ ఇండియా సినిమాలో చివరి సారిగా కనిపించిన ఆయన.. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. వంద కోట్లతో బడ్జెట్​తో ఓ సినిమాను తీస్తున్నట్టు ప్రకటించారు. ఆ వివరాలు త్వరలో తన తనయుడు మంచు విష్ణు వెల్లడిస్తారని తెలిపారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ మేరకు ప్రకటించారు. మరిన్ని విషయాలు త్వరలో మంచు విష్ణు తెలియజేస్తారని చెప్పారు.

Manchu Family Production House : అయితే మంచు ఫ్యామిలీ నిర్మాణ రంగంలోనూ ఉంది. 1982లో మోహన్​ బాబు స్థాపించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్​తో పాటు, మంచు విష్ణుకు సంబంధించిన 24 ఫ్రేమ్స్​ ఫ్యాక్టరీ, మంచు లక్ష్మీకి సంబంధించిన మంచు ఎంటర్​టైన్మెంట్స్​ ద్వారా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించింది ఈ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏ సంస్థ ద్వారా ఈ సినిమా నిర్మితమౌతుందన్న విషయం అభిమానుల్లో ఆసక్తి రేగుతోంది. అంతే కాకుండా రూ.100 కోట్ల‌తో సినిమా తీయ‌డం కోసం.. నిర్మాణానికి కంటే దాని మార్కెటింగ్​పై దృష్టి సారించాల్సి ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే వీరు ఏ సినిమాను తీయనున్నారన్న విషయంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Mohan Babu Movies : గ‌తంలో మోహ‌న్ బాబుతో 'రావ‌ణ బ్ర‌హ్మ' అనే సినిమాను చేయాల‌నుకున్నారు. కానీ ఆ సినిమా ప్రారంభ ద‌శ‌లోనే ఆగింది. త‌ర్వాత విష్ణు మంచు లీడ్ రోల్‌లో త‌నికెళ్ళ భ‌ర‌ణితో 'భ‌క్త క‌న్న‌ప్ప' సినిమాను రూపొందించాల‌నుకున్నారు. అది కూడా ఆగిపోయింది. దీంతో ఈ రెండిట్లో ఏదైనా సినిమా చేయనున్నారా.. లేకుంటే ఇంకేదైనా సినిమా రానుందా అంటూ అభిమానులు రక రకాలుగా ఆలోచిస్తున్నారు.

Mohan Babu Movies : 'సన్నాఫ్​ ఇండియా' తర్వాత మోహన్​ బాబు.. ప్రస్తుతం తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి 'అగ్ని నక్షత్రం' అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు ఆయన కోసం ఓ రీమేక్‌ కథ సిద్ధమైందని టాక్​. మలయాళంలో సూపర్​ హిట్ అయిన 'ఆండ్రాయిడ్​ కుంజప్పన్​ వెర్షన్‌ 5.25' అనే సినిమా ఇప్పుడు తెలుగులో పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు నటుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన తనయుడి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుణ్ని ఎంపిక చేయనున్నాం. ప్రస్తుతం తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా కథలో మార్పులు చేస్తున్నామని.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని విష్ణు అన్నారు.

Last Updated : Jun 1, 2023, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details