Comedian Sunil Tamil movie offers : హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్.. ఆ మధ్య హీరోగా ఒకట్రెండు విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రాణిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన కెరీర్ మంచి స్పీడ్‌లో దూసుకెళ్తోంది. చిన్న సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు సినిమాలతో పాటు సునీల్ ఎక్కువగా కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ జోరు చూపిస్తున్నారు. ఆయనకు ఎక్కువగా తమిళ సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్హిట్తో దూసుకెళ్తున్న 'జైలర్'లో సునీల్(jailer movie sunil) వేసిన డంబ్ హీరో రోల్ బాగా క్లిక్ అయింది. సెకండాఫ్ ఆయన కామెడీ బాగుందని అంటున్నారు. ఆయన పాత్రను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారట.
ఇకపోతే జైలర్ కన్నా ముందు వచ్చిన శివకార్తికేయన్ మహావీరుడులో ఓ మంత్రికి సెక్రెటరిగా కనిపించి ఆకట్టుకున్నారు. అందులో కూడా ఆయన నటన బానే ఉందని చెబుతున్నారు. కాస్త కామెడీ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించారు. ఇక త్వరలోనే సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న విశాల్ మార్క్ ఆంటోనీలో ఆయన నటించారు. ఇది కూడా మంచి పాత్ర అని చెన్నై టాక్ వినిపిస్తోంది.