Naga Chaitanya Custody Twitter Review : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య- యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ'. ప్రియమణి, అరవింద స్వామి లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం.. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ సినిమాకు ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది ఈ సినిమాను పర్లేదు అని అంటుంటే.. మరికొందరు ఈ సినిమా యావరేజ్ అన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నాగ చైతన్య, అరవింద స్వామి నటన బాగుందని.. కృతి శెట్టి సైతం తన నటనతో మంచి మార్కులు కొట్టేసిందని అంటున్నారు. కానీ కథ, కథనాల్లో అంతగా ఆసక్తి రేకెత్తించే అంశం లేదని అంటున్నారు.
స్లోగా స్టార్ట్ అయ్యే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సాగుతుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశారని ఆడియన్స్ అంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదని అన్నారు. మరోవైపు ఈ సినిమాలో సాంగ్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయని అంటున్నారు. పాటల పరంగా.. ఈ సినిమా పూర్తిగా నిరాశపరుస్తుందని అన్నారు.
ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుందని ఆడియన్స్ అంటున్నారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా.. సినిమాలోని థ్రిల్లర్స్‌కు స్క్రీన్ ప్లే ప్రధాన బలాన్ని చేకుర్చిందని టాక్. ఒక వేళ చక్కటి స్క్రీన్ ప్లే లేకుంటే ఈ సినిమా తేలిపోయుంటుందని చెబుతున్నారు. అయితే కొందరేమో కస్టడీ ఆద్యంతం అలరించిందని అంటున్నారు. సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్, నాగ చైతన్య పెర్ఫార్మన్స్ ఇలా అన్నీ బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ మెప్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
నాగ చైతన్య ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించారు. గత సినిమా డిజాస్టర్ తర్వాత ఈ మూవీ తీస్తున్నందున చై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కృతి శెట్టి ,అరవింద స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్ తిరేకెత్తించేలా ఉంది. కాగా ఇటీవలే ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే అండర్ వాటర్ సీన్స్‌ను ఎలా చిత్రీకరించారన్న దృశ్యాలను మూవీటీమ్ విడుదల చేసింది. స్కూబా డైవింగ్‌లో అనుభవమున్న నాగచైతన్య ఆ సన్నివేశాలను అవలీలగా చేసుకుంటూ వెళ్లగా.. కథానాయిక కృతిశెట్టి మాత్రం కొంత ఇబ్బందిపడిందని చిత్ర బృందం తెలిపింది.