తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కృష్ణ మృతితో టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయం.. షూటింగ్స్​ బంద్​ - సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత

సూపర్​ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించిన టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం షూటింగ్​లు బంద్​ చేయాలని పిలుపునిచ్చారు.

Super Star Krishna Shootings Bandh
కృష్ణ మృతితో టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయం.. షూటింగ్స్​ బంద్​

By

Published : Nov 15, 2022, 11:02 AM IST

సూపర్​స్టార్ కృష్ణ కన్నుమూయడం వల్ల టాలీవుడ్ చిత్రసీమ శోకసంధ్రంలో మునిగిపోయింది. అభిమానులు సెలబ్రిటీలు కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్​ నిర్మాతలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం అధికారికంగా సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చారు.

తీవ్ర దు:ఖంలో మహేశ్​.. మనకు బాగా కావాల్సిన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. కన్నవారు, తోబుట్టువులు తిరిగిరాని లోకాలకు వెళ్లడం మాటలకందని విషాదం. అలాంటిది నెలల వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు ప్రముఖ నటుడు మహేశ్‌బాబు. తన సోదరుడు రమేశ్‌బాబుని పోగొట్టుకున్న బాధలో ఉన్న మహేశ్‌ కోలుకునేలోపే ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపు తండ్రి కృష్ణ మరణం ఆయన్ను మళ్లీ విషాదంలోకి నెట్టేసింది.

ఈ కష్టకాలంలో మహేశ్‌కు శక్తినివ్వాలంటూ అభిమానులు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు ధైర్యాన్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 8న మహేశ్‌ సోదరుడు రమేశ్‌బాబు (నటుడు, నిర్మాత) కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా, ఆయన తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యతో సెప్టెంబరు 28న కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ .. మహేశ్‌కు దూరమయ్యారు.

ఇదీ చూడండి:సూపర్​స్టార్ కృష్ణ.. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు.. అవార్డులు

ABOUT THE AUTHOR

...view details