టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత - Tollywood producer Ramakrishna Reddy
Tollywood producer: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. అభిమానవంతులు, వైకుంఠపాలి, అల్లుడుగారు జిందాబాద్ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు.
![టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత Tollywood producer M.Ramakrishna Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15387508-thumbnail-3x2-img.jpg)
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత
Tollywood producer death: టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.రామకృష్ణారెడ్డి(76) మరణించారు. చెన్నైలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిమానవంతులు, వైంకుఠపాలి, అల్లుడుగారు జిందాబాద్, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, సీతాపతి సంసారం, అగ్ని కెరాటాలు వంటి హిట్ చిత్రాలకు రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ బ్యానర్‌పై వీటిని నిర్మించారు.