తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బన్నీ నెక్స్ట్​ ప్రాజెక్ట్​పై ప్రముఖ నిర్మాత కామెంట్స్​.. ఆ స్టార్ డైరెక్టర్​ ఫిక్స్​! - pushpa 2 update

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప ది రూల్' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన ఇంకా ఏ సినిమాను ఖరారు చేయలేదు. దీంతో తన తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉండనుందో అంటూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత బన్నీవాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..

allu arjun
allu arjun

By

Published : May 24, 2023, 1:49 PM IST

Updated : May 24, 2023, 3:48 PM IST

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో పాపులరయ్యారు ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. దీని తర్వాత ఏ సినిమా చేయనున్నారన్న విషయంపై అభిమానుల్లో సస్పెన్స్​ నెలకొంది. కానీ దిని గురించి ఎక్కడా అనౌన్స్​మెంట్​ రాలేదు. బన్నీ కూడా దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్​కు నిర్మాత బన్నీవాస్​ ఓ గుడ్​న్యూస్ చెప్పారు. తాజాగా '2018' సినిమా ప్రమోషన్స్​లో పాల్గొన్న బన్నీవాస్.. అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.

'పుష్ప ది రూల్' సినిమా తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్​లో ఓ సినిమా రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2024లో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్​, యాక్షన్ డ్రామా జోనర్​లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌తో క‌లిసి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు బన్నీవాస్ ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.

ఇప్పటికే హ్యాట్రిక్​ హిట్​... అయితే ఇప్పటికే అల్లు అర్జున్-త్రివిక్రమ్​ల కాంబినేషన్​లో వచ్చిన 'జులాయి', 'సన్​ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో' సినిమాలు బ్లాక్​ బస్టర్​గా నిలిచాయి. బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. 'అల వైకుంఠపురంలో అయితే నార్త్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరి కలయికలో నాలుగో చిత్రం రానుందని బన్నీవాస్ చేసిన ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకండా పోయాయి. ఇక ఈ ప్రాజెక్టు సెట్స్​పైకి వెళ్లితే అల్లు అర్జున్ హీరోగా నటించనున్న 22వ సినిమా అవుతుంది.

పుష్ప 2 షూటింగ్ అప్డేట్​​.. 'పుష్ప ది రైజ్'​కు సీక్వెల్​గా వస్తున్న 'పుష్ప ది రూల్' చిత్రంపై అంచనాలు పీక్స్​లో ఉన్నాయి. సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలె ఈ చిత్ర బృందం ఓ అప్​డేట్​ ఇచ్చింది. సినిమాలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ నటుడు 'ఫహద్ ఫాజిల్'కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసినట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్​ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్​స్టార్​ దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్​లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Last Updated : May 24, 2023, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details