Tollywood Pan India Stars :తెలుగు స్టార్ హీరోల్లో పాన్ఇండియా సినిమాల జోష్ స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే ప్రభాస్ పాన్ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తుండగా.. ఆర్ఆర్ఆర్తో జూ ఎన్టీఆర్, రామ్‌చరణ్, పుష్పతో అల్లు అర్జున్‌కు కూడా మార్కెట్ పెరిగింది. ఇక రాజమౌళి సినిమా అనౌన్స్‌మెంట్‌తో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, హరిహర వీరమల్లుతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా పాన్ఇండియా స్టార్ల లిస్ట్‌లో చేరిపోయారు. ఈ క్రమంలో ఆయా హీరోల నుంచి రానున్న సినిమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఆ హీరోలేవరు? సినిమాలేంటో చూసేద్దాం.
ప్రభాస్.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలు ఉండనుందని మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కల్కి 2898 AD, మారుతి డైరెక్షన్లో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగా స్పిరిట్ రానున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ కోసం రూ. 600 కోట్లు, దీనికి రెండు రేట్లు కల్కి సినిమాకు బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక వీటితోపాటు మారుతి సినిమా, స్పిరిట్ అన్నింటికి కలిపి సుమారు రూ. 2000 కోట్లు ఖర్చు చేయనున్నారని టాక్.
జూ. ఎన్టీఆర్.. ప్రభాస్ తర్వాత ఇండియా వైడ్‌గా అంత హైప్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం దేవర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. యష్ రాజ్ ఫిల్మ్స్ 'వార్ 2', ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 (వర్కింగ్ టైటిల్) సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లనింటికీ దాదాపు రూ. 1000 కోట్లకు పైనే ఖర్చవుతుందని అంచనా.