Tollywood Movies Latest Updates :దసరాకు స్టార్ హీరోల సినిమాల అప్డేట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ఇలా అప్డేట్ ఏదైనా సరే ఆ రోజు తమ అభిమాన తార సినిమా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతుం షూటింగ్ దశతో పాటు విడుదలకు రెడీ అవుతున్న 'గేమ్ ఛేంజర్', 'సలార్','గుంటూరు కారం' లాంటి సినిమాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటాయాని అభిమానులు ఆశించారు. కానీ చూస్తుంటే వారందికీ ఈ సారి నిరాశే మిగిలినట్టుంది.
Guntur karam Fisrt Single :సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ఇంత వరకు రాలేదు. ఇప్పుడు దసరాకైనా వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ తాజాగా తమన్ చేసిన ట్వీట్ చూస్తుంటే దసరాకు కూడా వచ్చేలా ఏమి కనిపించట్లేదని అర్థమవుతోంది. నవంబర్, డిసెంబర్, జనవరి అంతా మనదే అని ఆయన రాసుకొచ్చారు. అంటే ఈ సినిమా అప్డేట్స్ అక్టోబర్‌లో లేనట్టేనని అంతా అనుకుంటన్నారు. ఇక నవంబర్లోనే వస్తాయి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు.
Game Changer First Single : మరోవైపు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నుంచి ఇంత వరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవటం వల్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే దసరాకు ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తారంటూ ప్రచారం సాగడం కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడది ఆవిరైపోయింది. ఇంత వరకు ఎలాంటి సమాచారం లేకపోవటం వల్ల సాంగ్ రిలీజ్ చేయట్లేదని తెలుస్తోంది. తమన్ ఈ సాంగ్‌కు సంబంధించి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రెడీ చేశారట. హిందీ, తమిళంలో పూర్తి కాలేదని టాక్ నడుస్తోంది. మూవీ మేకర్స్ అన్నీ భాషల్లో సాంగ్స్‌ను రెడీ చేశాకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో దసరాకు కూడా చెర్రీ అభిమానులకు నిరాశనే మిగిలింది.