టాలీవుడ్ సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. షూటింగ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ప్రాధాన్య క్రమంలో సినిమా షూటింగ్స్‌కు అనుమతిస్తామని తెలిపింది. టాలీవుడ్‌లో ఈనెల 1న షూటింగ్స్ ఆగిపోయాయి. అప్పటి నుంచి తెలుగు సినిమా చిత్రీకరణలు జరగడం లేదు. నిర్మాతల సమస్యల పరిష్కారానికి వీలుగా షూటింగ్స్‌ను నిలిపివేశారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్‌కు గ్రీన్‌సిగ్నల్, ఆరోజు నుంచే షురూ - టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్
సినిమా షూటింగ్స్‌కు ప్రాధాన్య క్రమంలో అనుమతించనున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి షూటింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.
కరోనా పాండెమిక్ తరువాత మారిన పరిస్థితులు, పెరిగిన బడ్జెట్లు సహా.. కనీస వేతనాలు పెంచాలని టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు సమ్మెకు దిగిన నేపథ్యంలో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రొడ్యూసర్స్ గిల్డ్ భావిస్తోంది. సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి.. షూటింగ్స్ నిలిపివేసింది. ప్రస్తుత పరిణామాలపై లోతైన చర్చలు జరిపింది. సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్‌లను తిరిగి ప్రారంభించాలని గతంలో నిర్ణయించింది.
చర్చల్లో భాగంగా ఓటీటీల్లో సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని సినీ నిర్మాత దిల్‌రాజు ఇటీవల వెల్లడించారు. అలాగే థియేటర్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.