తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

స్క్రిప్ట్​ రెడీ.. క్రేజీ కాంబినేషన్.. రంగంలోకి దిగడమే లేట్​! - మహేష్​ త్రివిక్రమ్​ కాంబో

ఆగస్టు నెల విడుదలలే కాదు.. కొత్త సినిమా ఆరంభాలతోనూ కళకళలాడనుంది. పలువురు అగ్ర తారల చిత్రాలు పూర్వ నిర్మాణ పనుల్ని జరుపుకొంటున్నాయి. కథానాయకులూ ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుదామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. తెలుగు చిత్రసీమకి ఊపు తీసుకురానున్న సినీ విశేషాలు ఏంటంటే..

new movies
new movies

By

Published : Jul 26, 2022, 6:49 AM IST

New Movie Shootings August: కథలు నచ్చేశాయి. కలయికలు కుదిరాయి. స్క్రిప్టు కూడా పక్కా అయినట్టే. ఇక సెట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. అందుకు ముహూర్తంగా ఆగస్టు, సెప్టెంబరు మాసాలు ఖరారయ్యాయి. స్క్రిప్టునకి తుదిమెరుగులు.. లొకేషన్ల వేట.. నటీనటుల ఎంపిక.. ఇలా ఆయా చిత్రబృందాలు సినిమాల్ని పట్టాలెక్కించే పనుల్లో తలమునకలై ఉన్నాయి. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, బాలకృష్ణ, రామ్‌... పలువురు తారల కొత్త ప్రాజెక్టులు రానున్న రెండు నెలల్లో వరుసగా సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

అల్లుఅర్జున్​ పుష్ప2..
'పుష్ప'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. దాదాపు ఆరు నెలలుగా ‘పుష్ప2’ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి సుకుమార్‌ ఆ సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల మూడో వారం నుంచే చిత్రీకరణ షురూ చేయనున్నారు. ఇప్పటికే లొకేషన్ల ఎంపిక పూర్తి చేసింది చిత్రబృందం. తొలి సినిమా సంచలన విజయం సాధించడం, కొనసాగింపు చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పడంతో అందుకు ధీటుగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాయి సినీ వర్గాలు. కథ ఈసారి దేశ సరిహద్దులు దాటి వెళ్లనుందని సమాచారం.

అల్లుఅర్జున్- సుకుమార్​

మహేష్​- త్రివిక్రమ్​ కాంబో..
మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కలయికలో కొత్త చిత్రం ఈ ఆగస్టులోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్‌ ఇప్పటికే స్క్రిప్టుని సిద్ధం చేశారు. విదేశాల్లో ఉన్న మహేష్‌ తిరిగి రాగానే నిర్మాణ పనులపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. బోయపాటి - రామ్‌ కలయికలో సినిమా కూడా పట్టాలెక్కడమే ఆలస్యం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్‌ ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

మహేష్​ బాబు- త్రివిక్రమ్​

కొరటాల శివ-ఎన్టీఆర్​..
'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రీకరణ పూర్తయ్యాక ఎన్టీఆర్‌ కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు. తన కోసం కొరటాల శివ తయారు చేసిన స్క్రిప్టుతోనే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. దానికే తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. మరోపక్క ఎన్టీఆర్‌ ఈ సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా తన మేకోవర్‌ని మార్చుకొనే పనిపై దృష్టి పెట్టినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రెండు నెలల్లో ఎన్టీఆర్‌ ఎప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్​- కొరటాల శివ

బాలయ్య-అనిల్​ కలయికలో..
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి కలయికలో సినిమా పక్కా అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే అనిల్‌ కొబ్బరికాయ కొట్టనున్నారని తెలిసింది. రజినీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జైలర్‌’ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో విడుదలయ్యే చిత్రాల సంఖ్య భారీగానే ఉంది. వాటికే మాత్రం తగ్గకుండా ప్రారంభోత్సవాల జోరూ కనిపించనుంది.

బాలయ్య- అనిల్​ రావిపూడి

ఇవీ చదవండి:ెళ్లిపై నిత్యామేనన్​ మరోసారి క్లారిటీ.. ఈ సారి ఏం చెప్పిందంటే?

NBK 107: బాలయ్యతో సెల్ఫీ.. శ్రుతిహాసన్​ ఫన్నీ ఎక్స్​ప్రెషన్​!

ABOUT THE AUTHOR

...view details