తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'థియేటర్లలో ఆడియెన్స్​ అరుపులు మామూలుగా లేవు!'.. 'ఏజెంట్'​ ట్రోల్స్​పై అమల రియాక్షన్​ ఇదే!! - ఏజెంట్​ ట్రోల్స్​పై అమల అక్కినేని రిప్లై

అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమాపై సోషల్​ మీడియాలో వస్తున్న ట్రోల్స్​పై ఆయన తల్లి అమల అక్కినేని తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె ఇన్​స్టా వేదికగా ట్రోలర్స్​కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

amala akkineni about agent trolls
amala akkineni about agent trolls

By

Published : Apr 29, 2023, 1:27 PM IST

టాలీవుడ్​ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా విడుదలైంది. స్టార్​ డైరెక్టర్​ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్​కు తొలి రోజే మిశ్రమ స్పందన లభించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల ఎక్స్​పెక్టేషన్స్​ అందుకోవడంలో విఫలమయ్యింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అఖిల్​తో పాటు ఈ సినిమాపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో అఖిల్ తల్లి అమల అక్కినేని ఈ ట్రోలింగ్స్​పై ఇన్​స్టా వేదికగా స్పందించారు.

తన ఇన్​స్టాలో ఓ కొటేషన్​ గల పోస్ట్​ను షేర్​ చేసిన ఆమె ఓ క్యాప్షన్​ను రాసుకొచ్చారు. "ట్రోలింగ్ అనేది లోతైన అభద్రతతో పాటు సాధించవలసిన అవసరం ఉన్నప్పుడే వస్తుందని నేను అర్థం చేసుకుంటున్నాను. నేను నిన్న ఏజెంట్ సినిమా చూశాను. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో కొన్ని లోపాలున్నప్పటికీ మీరు ఓపెన్ మైండ్​తో ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. నేను సినిమా చూసిన థియేటర్​ జనంతో కిక్కిరిసిపోయింది. ఆడియన్స్​లో సగం మంది మహిళలు, తల్లులు, అమ్మమ్మలతో పాటు వారి భర్తలు, కొడుకులు ఉన్నారు. యాక్షన్ సీన్లకు వారు గట్టిగా కూడా అరిచారు. అఖిల్ అప్​కమింగ్​ మూవీ ఇంకా పెద్దగా, బెటర్​గా ఉంటుందని నేను కచ్చితంగా చెబుతున్నాను" అని అన్నారు.

వాస్తవానికి అఖిల్ 'ఏజెంట్' సినిమా కోసం మూడేళ్ల పాటు శ్రమించారు. హార్డ్ వర్క్ చేసి కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని తెచ్చుకుని, పూర్తిగా మేకోవర్ అయ్యాడు. అంతే కాకుండా స్పైగా కనిపించేందుకు తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. రా ఏజెంట్ గా కనిపించి ఆకట్టుకున్న అఖిల్.. యాక్షన్​ సీన్స్​లో అదరగొట్టాడు. అయినప్పటికీ ఆయనపై ట్రోల్స్​ ఆగటం లేదు.

ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు స్టోరీ అందించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించారు. ఇది ఆమె మొదటి సినిమా. అంతే కాకుండా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, డియో మోరియా, మురళీ శర్మ, అజయ్, సత్య లాంటి స్టార్స్​ సైతం ఇందులో కీలక పాత్రలు పోషించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిచగా.. హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటిర్​గా పని చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details