విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ 'రే డొనవన్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, ఈ వెబ్‌సిరీస్ త్వరలో ప్రముక ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌పై సీరియస్ అయ్యారు వెంకటేశ్. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో చేతిలో గన్ పట్టుకొని నెట్‌ఫ్లిక్స్‌ను బెదిరిస్తున్నట్లు కనిపించారు.
'నాతో జోక్స్ వద్దు..' నెట్‌ఫ్లిక్స్‌పై విక్టరీ వెంకటేశ్ ఫైర్.. - హీరో వెంకటేష్ తాజా వార్తలు
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ఫైర్ అయ్యారు టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
'పెద్ద తప్పు చేయొద్దు నెట్‌ఫ్లిక్స్.. హీరో ఎవరు?.. నేను, స్టార్ ఎవరు?.. నేను, కిరాక్‌గా కనిపించేది ఎవరు?.. నేను, ఫ్యాన్లు ఎవరు?.. నా వాళ్లే. సో.. షో పేరు కూడానాదే ఉండాలి. 'రానా నాయుడు' కాదు 'నాగా నాయుడు' అని ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. "మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ హో జాయేగా" అంటూ గన్ను టేబుల్‌పై విసిరేసి భయపెట్టించే పని చేశారు విక్టరీ వెంకటేశ్.' ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వెంకీ లుక్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.