తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అఖిల్​ 'ఏజెంట్' ట్విట్టర్ రివ్యూ.. 'పొన్నియిన్​ సెల్వన్​-2' ఎలా ఉందంటే? - అక్కినేని అఖిల్​ ఏజెంట్ అప్డేట్స్​

అక్కినేని అఖిల్​ 'ఏజెంట్​', 'పొన్నియిన్​ సెల్వన్ 2' సినిమాలు శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్​ షోలు చూసిన అభిమానులు ఈ సినిమాల గురించి ట్విట్టర్​ వేదికగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 28, 2023, 7:53 AM IST

Updated : Apr 28, 2023, 8:29 AM IST

టాలీవుడ్​ హీరో అక్కినేని అఖిల్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'ఏజెంట్​'.ఇన్నేళ్లు సాప్ట్​ క్యారెక్టర్స్​తో కనిపించిన అఖిల్​.. ఈ సినిమాలో వైల్డ్​ లుక్​లో దర్శనమిచ్చాడు. సినిమా షూటింగ్​ నుంచి ప్రమోషన్ల వరకు మూవీ టీమ్​తో కలిసి ఎంతో శ్రమించాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్​గా రిలీజ్ అయింది. తమిళంతో పాటు రిలీజైన అన్నీ భాషల్లోనూ సంచలనం సృష్టించిన మణిరత్నం మూవీ పొన్నియన్​ సెల్వన్​కు సీక్వెల్​గా తెరెక్కెక్కిన పీఎస్​ 2 కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్​ షోలు చూసిన అభిమానులు ఈ సినిమాల గురించి ట్విట్టర్​ వేదికగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?

అఖిల్​ కెరీర్​లో బ్రేక్​ ఇచ్చేలా తెరకెక్కిన స్పై థ్రిల్లర్​ 'ఏజెంట్‌' సినిమాలో మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన కొత్త హీరోయిన్​ సాక్షి వైద్య నటించింది. శుక్రవారమే గ్రాండ్​గా ఈ సినిమా రిలీజైంది. 'రా' ఏజెన్సీని బేస్​ చేసుకుని సాగే సినిమాలా కనిపిస్తోంది. రా ఆఫీసర్‌ అయిన మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫలమైతే, వాళ్లని పట్టుకోవడానికి మనం కాదు, అందుకు అఖిలే సరైన వ్యక్తి అని భావించి.. ఆ ఆపరేషన్‌ ఏజెంట్‌ని అఖిల్‌కు అప్పగిస్తారు. దీంతో అఖిల్‌.. ఆ ముఠాను ఎలా పట్టుకున్నాదన్నదే మిగతా కథ.

ఇప్పటికే సినిమాను చూసిన అభిమానులు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. యాక్షన్‌ బ్లాక్స్, ప్రొడక్షన్‌ బాగున్నాయని అన్నారు. అఖిల్‌ యాక్షన్‌ పరంగా మెప్పించాడని, కానీ నటనతో అంతగా ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు. సినిమా మొదటి భాగం కొంత ఫర్వాలేదన్నట్లుగా ఉందని టాక్​. కానీ సెకండాఫ్‌ మాత్రం అభిమానులను కాస్త నిరాశ పరిచిందట. అఖిల్‌లో ఎనర్జీ ఉన్నప్పటకీ సరైన సీన్లు, స్టోరీ పడటం లేదని అభిప్రాయపడుతున్నారు.

మరికొంతమందేమో ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ ఆ స్థాయిలో లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్‌, అఖిల్‌ వైల్డ్ యాక్టింగ్‌ బాగుందని అంటున్నారు. సెకండాఫ్‌లో బలమైన కథ ఉంటే బాగుండేదని ట్వీట్లు చేస్తున్నారు. ఆ విషయంలో దర్శకుడు కాస్త నిరాశపరిచారని అంటున్నారు. ఫస్టాఫ్‌ ఓకే అయినా.. సెకండాఫ్‌ సాగదీతగా, అనేక మలుపులు తిరుగుతూ ఉందని టాక్​. ఇక అఖిల్‌, మమ్ముట్టి అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు.

ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 2 ' కూడా శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. ఇక ఈ సినిమాను చూసిన అభిమానులు ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం కంటే చాలా బాగుందని అంటున్నారు. కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందని టాక్​. పార్ట్ 1లో నిదానంగా వెళ్లిన ఈ కథ.. రెండో భాగంలో మాత్రం కాస్తా వేగంగా ఉంటుందని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుందని టాక్​. ఇక ద్వితీయార్ధం కూడా బాగుందని అభిప్రాయపడుతున్నారు. విజువల్స్, సీజీ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్, ఇలా అన్ని అంశాలు సినిమాకు హైలైట్​గా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమా సెకెండ్​ ఆఫ్​తో పాటు క్లైమాక్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అంటున్నారు.

Last Updated : Apr 28, 2023, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details