Adivi Sesh Tweet : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. "వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం?" అంటూ ఆయన రాసిన ట్వీట్‌కు అర్థం తెలియక నెటిజన్లే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు సైతం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆయన ఈ టైమ్‌లో ఎందుకిలా ట్వీట్ చేశారంటూ ఆలోచనలో పడిపోయారు. కొంత మంది సెలబ్రిటీలు ఈ పోస్ట్‌కు కామెడీగా కామెంట్లు పెట్టారు.
ఈ ట్వీట్‌కు స్పందిస్తూ నటుడు రాహుల్ రవీంద్రన్ .. 'శేష్ ఏం చెబుతున్నాడు వెన్నెల కిషోర్.. ఏదో రహస్యంగా చెబుతున్నాడు. కొంపతీసి మనగురించేనా? అని కామెంట్ చేయగా.. దీనికి వెన్నెల కిషోర్ రాహుల్‌కి రిప్లయ్ ఇచ్చారు. అవన్నీ ట్రాఫిక్ కోట్స్ అవి.. ప్రశాంతంగా ఉండి.. కిందకి స్క్రోల్ చేయండి' అని రాసుకొచ్చారు. వీరి సంభాషణ నవ్వులు పూయించింది. దీనికి ప్రముఖ సింగర్ చిన్మయి కూడా ఎమోజీలతో రియాక్ట్ అయింది. అభిమానులు సైతం ఈ పోస్ట్‌పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Adivi Sesh Movies : ఇక శేష్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. హిట్ 2 సినిమాతో మంచి టాక్ అందుకున్న శేష్.. 'జీ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేష్ సినిమాల్లో సూపర్ హిట్ టాక్ అందుకున్న గూడఛారి సినిమాకు సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇటీవలే అడివి శేష్ అరుదైన ఘనత అందుకున్నారు. 'మేజర్' మూవీని చూసిన భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. శేష్‌తో పాటు మూవీ యూనిట్‌ను తన నివాసానికి పిలిచి సత్కరించారు. సినిమా బాగుందంటూ కొనియాడారు. దీంతో భావోద్వేగానికి లోనైన శేష్.. ట్విట్టర్ వేదికగా కోవింద్‌కు కృతజ్ఞత తెలిపారు.
'గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌జీని కలవడం విశేషం. 'మేజర్' సినిమాపై ఆయన స్పందించిన తీరుతో పొంగిపోయాను. ఆయనతో మంచి సంభాషణ జరిగింది. త్వరలో మేజర్ మొదటి వార్షికోత్సవం జరగనుంది. ఇప్పటికీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మమ్మల్ని ఆశీర్వదిస్తునే ఉన్నారు. ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా 'మేజర్' రికార్డుకెక్కింది. మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందాన్ని కొనియాడారు.
భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మేజర్ టీమ్