గతంలో కాలంలో మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమలు తీసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అందుకున్నారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. లైగర్ సినిమా పరాజయం తర్వాత ఈయన ఏ హీరోతో సినిమా తీస్తాడన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి రేగింది. ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. కానీ వరుస పరాజయాలను మూటగట్టుకున్న పూరీ కెరీర్‌కు ఊపు తీసుకొచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎనర్జిటీక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రామ్ యాక్టింగ్‌తో పాటు, పూరి డైరెక్షన్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించాయి.
ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా రాబోతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్స్ ఈ స్పెషల్ అప్‌డేట్‌ను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. "నాలుగేళ్ల తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి పనిచేయబోతున్నారు. దిమాక్ ఖరాబ్ అనౌన్స్‌మెంట్" అంటూ కొత్త మూవీకి సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలియజేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అటు రామ్ ఫ్యాన్స్‌తో పాటు పూరీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ కొత్త అనౌన్స్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.