Comedian Ali daughter engazement బాలనటుడు, కమెడియన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వ్యాఖ్యాతగా ఇలా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటుడు ఆలీ. తెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులు పూస్తాయి. ఆలీ సినిమాలు, టీవీ షోల ద్వారా అలరిస్తుంటుంటే, ఆయన సతీమణి జుబేదా ఆలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. హోమ్ టూర్ వీడియోలు, వంటల వీడియోలు, పండగలప్పుడు స్పెషల్ వీడియోలు ఇలా రకరకాల వీడియోలతో సోషల్మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవే ఆమె తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించి షాపింగ్ వీడియోలను అప్‌లోడ్ చేశారు. నిశ్చితార్థానికి కావాల్సిన బంగారు ఆభరణాలు, చీరలు వంటి షాపింగ్ వీడియోలను ఆమె ఛానల్‌లో అప్లోడ్ చేశారు.
ఘనంగా కమెడియన్ ఆలీ కూతురు నిశ్చితార్థం, వీడియో చూశారా - కమెడియన్ ఆలీ కూతురు నిశ్చితార్థం వీడియో వైరల్
Comedian Ali daughter engazement టాలీవుడ్ కమెడియన్ ఆలీ కూతురు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆలీ బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఆలీ కూతురు నిశ్చితార్థ వేడుకలను చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకి తగ్గట్టే ఆలీ సతీమణి తన కూతురి ఎంగేజ్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఆలీ, జుబేదా ఆలీ దంపతుల కూతురు నిశ్చితార్ధ వేడుకలు ఒక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆలీ బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. హాస్యనటుడు బ్రహ్మానందం, సాయికుమార్, సురేఖ దంపతులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బంధువులు, అతిధుల సమక్షంలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకుని నిఖా ఖాయం చేసుకున్నారు. వేడుకలో పాల్గొన్న బంధువులు ఆట, పాటలతో, డ్యాన్సులతో అలరించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.