తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో 'యమదొంగ' కెమెరామెన్​ కన్నుమూత - ప్రవీణ్​ అనుమోలు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ‍్రాంతి వ్యక్తం చేశారు.

praveen anumolu passed away
praveen anumolu passed away

By

Published : Mar 6, 2023, 6:39 AM IST

టాలీవుడ్​ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నందమూరి తారకరత్న మరణాన్ని మరువకముందే మరొకరు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ‍్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రవీణ్​ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభాతి తెలిపారు.

2017లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన 'దర్శకుడు' మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి సూపర్​ హిట్​ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా సేవలందించారు. ప్రవీణ్ మృతి చెందడం టాలీవుడ్‌ మరోసారి విషాదంలో మునిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details