Varun Tej and Lavanya Tripathi Vacation : టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో జూన్ 9న జరగనుంది. ఈ క్రమంలో ఈ జంట.. తమ ఎంగేజ్మెంట్కు ముందు వెకేషన్‌కు వెళ్లిందని.. పారిస్ అందాలను ఆస్వాదిస్తూ ఈ జంట వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది.
వారం క్రితం లావణ్య త్రిపాఠి ట్రావెల్ మోడ్ అంటూ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న తన లేటెస్ట్ సెల్ఫీని అప్లోడ్ చేశారు. అయితే ఈమె ఎక్కడికి వెళ్తోందన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు వరుణ్ తేజ్ కూడా హాలీడేలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం పారిస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ ఒకే చోట ఉన్నారంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వారి పోస్ట్‌ల కింద విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో లావణ్య పోస్ట్ కింద.. 'వెల్కమ్ టు మెగా ఫ్యామిలీ', 'వరుణ్ తేజ్‌తో ఎప్పుడు మీ మ్యారేజ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు వీరిద్దరూ శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని ఆ తర్వాత తమ ఎంగేజ్మెంట్ కోసం సన్నాహాలు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.