తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గుడ్​న్యూస్​ చెప్పిన RRR​ నటుడు.. సంక్రాంతికి రిలీజ్​​ అంటూ పోస్ట్​.. - రాహుల్​ రామకృష్ణ సినిమాలు

టాలీవుడ్ స్టార్​ కమెడియన్​ గుడ్​ న్యూస్​ చెప్పారు. సంక్రాంతికి రిలీజ్ అంటూ సోషల్​ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో సినీ సెలెబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

rahul rama krishanblessed with a baby boy
rahul rama krishanblessed with a baby boy

By

Published : Jan 16, 2023, 3:33 PM IST

సంచలన విజయం సాధించిన అర్డున్​ రెడ్డి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందారు నటుడు రాహుల్​ రామకృష్ణ. తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడీ స్టార్​ ఆర్టిస్ట్​ ఓ గుడ్​ న్యూస్​ చెప్పారు. దీంతో సంక్రాంతి రోజు రామకృష్ణ ఇంట నిజమైన పండగ వాతావరణం వెల్లివిరిసింది. ఆ గుడ్​ న్యూస్​ ఎంటంటే.. రాహుల్​ రామకృష్ణ తండ్రి అయ్యారు.

ఈ విషయాన్ని త‌న సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రాహుల్.. సంక్రాంతి పండుగ రోజున కొడుకు పుట్టాడ‌ని తెలిపారు.'బాయ్​.. సంక్రాంతి రిలీజ్' అంటూ తన కుమారుడి ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ పెట్టిన పోస్ట్​కు.. పలువురు సినీ సెలెబ్రెటీలు​.. అభినందనలు చెబుతున్నారు.

లఘుచిత్రాలతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రాహుల్​. 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు నటుడిగానే కాకుండా డైలాగ్‌ రైటర్‌గా కూడా పనిచేశారు. 'అర్జున్‌ రెడ్డి' మూవీ తో రాహుల్‌కు మంచి క్రేజ్ వచ్చింది. శివ పాత్రలో జీవించేశారు. దీంతో తక్కువ సమయంలో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. ప్రస్తుతం రాహుల్​ నాలుగు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌తో సహా ఐదారు సినిమాల్లో నటించారు. నటనతో పాటు సింగర్‌, రైటర్‌, లిరిసిస్ట్‌గా సత్తా చాటుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details