తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నిఖిల్ చేతిలో 'సెంగోల్​'.. ఈ యంగ్ హీరో టార్గెట్​ వారేనా! - nikhil upcoming movies

దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు!.. సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు డైలాగ్ ఇది. ప్రస్తుతం దీనిని పక్కాగా ఆచరిస్తున్నాడు టాలీవుడ్​ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ట్రెండ్​కు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ.. భిన్న కథల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మూస పద్ధతికి దూరంగా ఈ యువహీరో చేస్తున్న ప్రయత్నాలు సినీ ప్రియుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇండియన్​ హిస్టరీలో హద్దులు చెరిపేసే పాన్ ఇండియా కథలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి జోలికి వెళ్లే దర్శకనిర్మాతలు హీరోలు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఓ ప్రత్యేకమైన జానర్ సినిమాల్ని తెలివిగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు నిఖిల్. ఆయన సినిమాల గురించే ఈ కథనం..

Hero Nikhil 20 Pan India Movies
నిఖిల్ చేతిలో 'సెంగోల్​'.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్​గా తెరపైకి..!

By

Published : Jun 1, 2023, 4:08 PM IST

Updated : Jun 1, 2023, 4:13 PM IST

Nikhil Upcoming movies : హీరో నిఖిల్​​.. టాలీవుడ్​ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యువత, వీడు తేడా, హ్యాపి డేస్​, స్వామిరారా, కేశవ, సూర్య vs సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తీకేయ వంటి మీడియం రేంజ్​ సినిమాలతో తనకంటూ ఓ క్రేజ్​ను సంపాదించుకున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమున్న ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్​లో పాపులారిటీని సంపాదించుకున్నారు. అందుకు కారణం.. ఆయన రీసెంట్​గా నటించిన కార్తీకేయ-2 ఇండియావైడ్​లో సూపర్​ హిట్​ కావడమే. ఈ సినిమాతో ఇక్కడి వారికన్నా.. నార్త్​ ఆడియెన్స్​కు బాగా చేరువైంది. బాక్సాఫీస్​ ముందు మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన 18 పేజీస్​ కూడా బాగానే ఆడింది. అలా బ్యాక్​ టు బ్యాక్ సక్సెస్​లను అందుకున్న నిఖిల్​.. ఆ తర్వాత అన్ని విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. దీంతో అందరి దృష్టి ఆయనే మీదే పడింది.

నిఖిల్​పై బడా నిర్మాతల కన్ను.. హ్యాపీడేస్​ సినిమాలో సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ఆ తర్వాత కొన్ని వరుస సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 'స్వామిరారా' చిత్రంతో రూట్​ మార్చిన ఆయన.. డిఫరెంట్ కాన్సెప్ట్​ను ఎంచుకుంటూ హిట్స్ ఫ్లాప్స్​తో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నారు. అలా ఆయన చేసిన కొన్ని సినిమాలు కమర్షియల్​గా వర్కౌట్ కాకపోయినా.. నిఖిల్​కు మంచి పేరు తెచ్చాయి. కొన్ని కమర్షియల్​గానూ మంచి కలెక్షన్స్​ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే వచ్చిన కార్తికేయ 2 సినిమా దేశవ్యాప్తంగా భారీ హిట్ అందుకోవడంతో నిఖిల్ రేంజ్​ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. వరుసగా ఆఫర్స్​ క్యూ కడుతున్నాయట.

Nikhil Pan India Movie : అయితే నిఖిల్​ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. గతంలో కన్నా మరింత భిన్నంగా సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అన్నీ పాన్​ ఇండియా లెవెల్​లోనే ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అవేమీ ఇంకా రిలీజ్​ కాలేదు కానీ అన్నీ అనౌన్స్​మెంట్​ దిశలోనే ఉన్నాయి. 'స్పై' చిత్రం మినహా మిగతావి ఇప్పుడిప్పుడే మొదలుకానున్నాయి. రీసెంట్​గా వచ్చిన 'స్పై' టీజర్​.. సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సృష్టికర్త అయిన సుభాష్‌ చంద్రబోస్‌ మరణం, రహస్యాల ఛేదన నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్‌ గూఢచారిగా కనిపించనున్నారు.

ఇక కార్తికేయ2తో బిగ్గెస్ట్ సక్సెస్ అందించిన అభిషేక్ అగర్వాల్ బ్యానర్​తో పాటు కొత్త బ్యానర్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్ 'వి' మెగా పిక్చర్స్ పతాకంపై నిఖిల్ మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. ​స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని అంశాల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని అర్థమవుతోంది. రిలీజైన వీడియోను చూస్తే ఇది స్వాతంత్య్రానికి పూర్వం లండన్‌ నేపథ్యంలో సాగే కథతో నడుస్తుందని స్పష్టమవుతోంది.

Nikhil new Movie : ఇప్పుడు జూన్​ 1న తన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు నిఖిల్​. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర పోస్టర్‏ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ ఖ‌డ్గం త‌ర‌హాలో ఉన్న ఆయుధం కనిపిస్తోంది. దీన్ని ఎంతో ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశారు. దీన్ని చూస్తుంటే ఇటీవలే నూతన పార్లమెంట్​ భవనంలో స్పీకర్​ కుర్చీ పక్కన ప్రతిష్ఠించిన రాజదండం 'సెంగోల్​'ను తలపించేలా కనిపిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో నిఖిల్​ 20 సినిమా కథ మొత్తం ఏమైనా ఈ సెంగోల్​ చుట్టూ తిరగనుందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ మూవీ ఓ యోధుడి గురించే తెలియజేసే పురాణ ఫాంటసీ కథ అని కూడా అంటున్నారు. ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే 'కార్తికేయ 3' కూడా రానుంది.

'Nikhil 20' ఫస్ట్ లుక్!

ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి 25 వేలు లంచం ఇచ్చాను గతంలో చెప్పిన నిఖిల్.. ఇప్పుడు 100 కోట్ల పాన్ ఇండియా సినిమాలో హీరోగా చేస్తుండటం పెద్ద విషయమనే చెప్పాలి. అలా మొత్తంగా నిఖిల్ ఎంచుకునే సినిమాలు ప్రతిఒక్కటి పాన్​ ఇండియా లెవల్​లోనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి తరహా సినిమాలను మనవాళ్ల ఆదిరించినప్పటికీ.. మన కన్నా హిందీ ఆడియెన్స్​ మరింత బాగా చూస్తారు! అందుకే నిఖిల్​ తన పాన్ ఇండియా మార్కెట్​ను దృష్టిలో మిగతా హీరోల కన్నా ఢిఫరెంట్​గా ఆలోచిస్తూ కెరీర్​ను ప్లాన్ చేస్తున్నారు.

Last Updated : Jun 1, 2023, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details