నటసింహం బాలకృష్ణ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా 'అఖండ'. 2021లో రిలీజైన ఈ సినిమా అభిమానుల ప్రశంసలను చురగొనడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే అప్పట్లో టాలీవుడ్లో సెన్సేషన్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని బీటౌన్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ తెలిపింది. 'ఆర్ఆర్‌ఆర్' మూవీని హిందీలో రిలీజ్ చేసిన సంస్థ కూడా ఇదే.
మరోసారి బాలకృష్ణ అఖండ రిలీజ్.. ఎక్కడంటే ?? - అఖండ మూవీ హిందీ ట్రైలర్
2021లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ అఖండ. నటసింహం బాలకృష్ణ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా త్వరలో బాలీవుడ్‌లోనూ సందడి చేయనుంది. ఆ విషయాలు మీ కోసం.
balakrishna
గురువారం అఖండ హింది వర్షన్‌కు సంబంధించిన ఓ ట్రైలర్ సైతం విడుదల చేసింది పెన్ సంస్థ. ఇప్పటికే తెలుగు వర్షన్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ₹120.8 కోట్లు సంపాదించింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జనవరి 20న బాలీవుడ్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ ఆశలను పెట్టుకున్నారు మూవీ మేకర్స్. సౌత్‌లో 'అఖండ'కు లభించిని ఆదరాభిమానాలు నార్త్‌లోనూ లభించాలని మేకర్స్ ఆశిస్తున్నారు.