Telugu Hits 2023 : 2023లో టాలీవుడ్‌కు మంచి ఆరంభం దక్కిన సంగతి సినీ ప్రియులకు తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది అప్పుడే 8 నెలలు పూర్తైయ్యాయి. ఈ 8 నెలల్లో బాక్సాఫీస్ ముందు స్ట్రైట్ అండ్ డబ్బింగ్ సినిమాల హిట్స్ శాతం మంచిగా ఉంది. దాదాపు 16 సినిమాల వరకు ఊహించని రేంజ్లో భారీ హిట్లను అందుకుని సెన్సేషనల్ సృష్టించాయి. అందులో బడా సినిమాలు మూడు నాలుగు ఉండగా మిగతా వన్నీ చిన్న చిత్రాలే కావడం విశేషం. ఇవన్నీ కలిపి టాలీవుడ్ బాక్సాఫీస్‌కు వందల కోట్ల వసూళ్లను తెచ్చిపెట్టాయి.
Tollywood 2023 Box Office Collection : మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సూపర్ బ్లాక్ బ్లాస్టర్ హిట్స్‌ను అందుకుని ఈ ఏడాది టాలీవుడ్‌కు మంచి ఊపునిచ్చాయి. 'వాల్తేరు' రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగి రూ. 135కోట్లు షేర్, రూ. 236.15 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసింది. దాదాపు రూ. 46 కోట్ల వరకు లాభాలను అందుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.200కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. బాలకృష్ణ 'వీరసింహా'.. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ముందుకు వచ్చి రూ. 80 కోట్ల షేర్, రూ. 134 కోట్ల గ్రాస్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ స్టేటస్‌ను ఖాతాలో వేసుకుంది.
- ఇక ఫిబ్రవరి 3న రూ. 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన 'రైటర్ పద్మభూషణ్'.. రూ. 6.45 కోట్ల షేర్ వసూళ్లను అందుకుని మహిళల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా రూ. 4.45 కోట్ల లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా విజయాన్ని అందుకుంది.
- తమిళ యాక్టర్ ధనుశ్.. తెలుగులో చేసిన తొలి స్ట్రైట్ సినిమా 'సార్'.. మార్చి 17న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో రూ. 38.60 కోట్లు గ్రాస్, వరల్డ్ వైడ్‌గా రూ. 63.05 కోట్ల షేర్, రూ. 120.83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుని హిట్‌గా నిలిచింది.
- ఇక ఇదే మార్చి నెలలో వచ్చిన 'బలగం'.. ప్రొడ్యూసర్లకు పదింతల లాభాలను తెచ్చిపెట్టి అంతర్జాతీయ స్థాయిలో వందకు పైగా పురస్కారాలను అందుకుంది. శివరాత్రి కానుకగా మార్చి 18న అభిమానుల ముందుకు వచ్చిన యావరేజ్ కంటెంట్ సినిమా కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు' కథ కూడా హిట్ స్టేటస్‌ను అందుకుని మంచి వసూళ్లనే అందుకుంది. దాదాపు రూ. 5.29 కోట్ల షేర్, రూ. 10.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
- మార్చి 22న విడుదలైన విశ్వక్ 'దాస్ కా దమ్కీ'.. రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో.. కథ పరంగా కాకపోయినా వసూళ్ల పరంగా రూ. 11 కోట్లకు పైగా షేర్ అందుకుని సేఫ్‌గా నిలిచింది. మార్చి నెల మొత్తంలో భారీ హిట్ అందుకున్న నాని 'దసరా' అయితే ఏకంగా వంద కోట్లకు వసూళ్లను అందుకోవడం విశేషం.
- సాయి ధరమ్ తేజ్ మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' రూ.100కోట్లకు చేరువకు రాగా.. 'మేం ఫేమస్' మంచి టాక్‌ను అందుకుంది. ఇక వీటి తర్వాత వచ్చిన శ్రీవిష్ణు 'సామాజవరగమణ', ఆనంద్ దేవరకొండ 'బేబీ' బాక్సాఫీస్ వద్ద
- అస్సలు ఎవరూ ఊహించని విధంగా సంచలనం సృష్టించాయి. 'సామాజవరగమణ' రూ. 50కోట్లు, 'బేబీ' రూ.70కోట్ల వరకు అందుకని సినీ ప్రియుల్ని థియేటర్లకు పరుగులు పెట్టించాయి.
- Rajinikanth Jailer collections : వీటితో పాటే పలు డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. సంక్రాంతికి 'వాల్తేరు', 'వీరసింహా'తో పాటు విడుదలైన దళపతి విజయ్ 'వారసుడు'.. రొటీన్ కథ అయినప్పటకీ హీరో క్రేజ్‌తో ఏకంగా వరల్డ్ వైడ్‌గా రూ.300కోట్ల కలెక్షన్లను అందుకుంది. విజయ్ ఆంథోనీ 'బిచ్చగాడు 2', కేరళ వరదలు నేపథ్యంలో వచ్చిన '2018' కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్‌లను అందుకున్నాయి. ఇప్పుడు రీసెంట్గా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' కూడా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. మూడు రోజుల్లోనే ఇప్పటివరకు రూ.100కోట్ల వరకు వసూళ్లను సాధించాయి.