'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి సంచలనం సృష్టించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ పాత్రలో చరణ్ ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేశారు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో, ఆయన నటన బీస్ట్ మోడ్‌ను తలపించింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన టైటానిక్‌లో హీరోయిన్ కేట్ విన్స్లెట్కు తల్లిగా నటించిన ఫ్రాన్సెస్ ఫిషర్ తాజాగా చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
రామ్‌చరణ్‌పై టైటానిక్ నటి ప్రశంసల వర్షం.. బాడీ ఫిట్నెస్ అదుర్స్ అంటూ!
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌పై టైటానిక్ ఫేమ్ ఫ్రాన్సెస్ ఫిషర్.. ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
Ram Charan Frances Fisher
చరణ్ ట్వీట్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. స్టంట్స్, డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్ చేయడంలో ఆయన బాడీ ఫిట్నెస్ చక్కగా ఉందని అభినందించారు. ప్రస్తుతం ఆమె రిప్లై ట్విట్టర్లో వైరలవుతోంది. ప్రస్తుతం దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ.. చరణ్‌కు జోడీగా కనువిందు చేయనున్నారు. ఈ సినిమా..2023లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Last Updated : Jan 4, 2023, 11:05 AM IST