Tillu Square Release Date :'డీజే టిల్లు'తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు సిద్ధు జొన్నల్లగడ్డ. ఈ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించి మంచి వసూళ్లనూ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. అయితే వాయిదా పడుతూ వచ్చిన ఈ సీక్వెల్ రిలీజ్ డేట్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చింది మూవీటీమ్.
వివరాళ్లోకి వెళితే.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ చిత్రాన్ని గతేడాది దీపావళికి అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ను ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. అయితే మొదట ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ కంప్లీట్ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు.
ఇప్పుడు తాజాగా ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత కూడా ఓ పోస్ట్ పెట్టారు. "మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి టిల్లు స్వ్కేర్ వచ్చేస్తున్నాడు. మొదటి పార్ట్‌ను మించి వినోదాన్ని పంచనున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనున్నాడు" అని తెలిపారు.