తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Tillu Square : టిల్లు నుంచి కొత్త అప్​డేట్​.. అప్పుడే కామెడీ మేనియా షురూ.. - డీజే టిల్లు 2 టికెటే కొనకుండా సాంగ్

Tillu Square Promo Song : హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం 'టిల్లు స్క్వేర్' నుంచి తాజాగా అప్​డేట్​ వచ్చింది. ఈ సినిమాలోని 'టికెటే కొనకుండా' పాటను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Tillu Square Song Promo
టిల్లు స్క్వేర్ సాంగ్ ప్రోమో

By

Published : Jul 24, 2023, 10:37 PM IST

Tillu Square Promo Song : యంగ్​ హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రామ్ మల్లిక్ కాంబినేషన్​లో రూపొందుతున్న చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఆయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమాలోని 'టికెటే కొనకుండా' అనే పాటను జులై 26న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

మామూలుగా సాంగ్ ప్రోమో అంటే.. ఎవరైనా పాటకు సంబంధించిన లిరిక్స్ లేదా మ్యూజిక్ బిట్ వదులుతారు. కానీ 'టిల్లు స్క్వేర్' మూవీమేకర్స్ కాస్త డిఫరెంట్​గా ఓ వీడియోను రిలీజ్ చేశారు. చిత్రబృందం టిల్లు మూవీ అంటే .. ఇతర వాటి కన్నా భిన్నంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. తాజా వీడియో క్లిప్​ చూసిన ప్రేక్షకులు మళ్లీ 'టిల్లు' మేనియా మొదలైనట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tillu Square Promo video : అయితే వీడియోలో ఏముందంటే.. హీరో సిద్ధు తన షూ తుడుచుకుంటూ.. హీరోయిన్ అనుపమతో మాట్లాడుతాడు. 'మనసు విరిగినట్టుంది ఎక్కడో అంటూ మాటలు కలుపుతాడు టిల్లు. నీకు బాయ్​ఫ్రెండ్ ఉన్నాడా' అంటూ మెల్లిగా ఫ్లర్టింగ్ స్టార్ట్ చేసిన విధానానికి ఆడియెన్స్ అప్పుడే కనెక్ట్ అయిపోయారు. 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో విపరీతంగా నవ్వులు పూయిస్తోంది. ఈ చిన్న వీడియో క్లిప్​యే ఇంత ఫన్నీగా ఉంటే.. ఇక సినిమా మొత్తం ఏ రేంజ్​లో ఉండనుందో అని ఫ్యాన్స్ అంచనాలు ఇట్టే పెంచుకుంటున్నారు. అయితే గతేడాది 'డీజేటిల్లు' గా ప్రేక్షకులను పలకరించిన సిద్ధు సూపర్ సక్సెస్ అందుకున్నారు.

Tillu Square Cast : సితారా ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. సిద్ధుకు జంటగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా నటిస్తోంది. కాగా 'టిల్లు స్క్వేర్' వినాయక చవితి పండగ సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ప్రోమో విడుదలైన నాలుగు గంటల వ్యవధిలోనే 6 లక్షల పైచిలుకు వ్యూస్​తో యూట్యూబ్​లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 55 వేల లైకులు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details