తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Tiger vs Pathaan Movie: 28 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్​పై.. ఆ క్రేజీ ప్రాజెక్ట్​కు షారుక్​- సల్మాన్​ గ్రీస్​ సిగ్నల్​ ? - టైగర్​ వర్సెస్​ పఠాన్​ లేటెస్ట్ అప్డేట్

Tiger vs Pathaan Movie: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు సల్మాన్, షారుక్​ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే త్వరలో ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్​పై కనిపించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై బీ టౌన్​లో చర్చలు జరుగుతున్నాయి. ఆ విశేషాలు మీ కోసం..

Tiger vs Pathaan Movie
Tiger vs Pathaan Movie

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 8:21 PM IST

Tiger vs Pathaan Movie :బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు సల్మాన్, షారుక్​ తమ తమ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. 'జవాన్' సినిమాతో షారుక్ ప్రేక్షకులను పలకరించగా.. 'కిసీ కా భాయ్​ కిసీకీ జాన్'​ అంటూ రీసెంట్​గా సల్మాన్​ థియేటర్లలో సందడి చేశారు. ఇక వీళ్లిద్దరి సినిమాలు బాక్సాఫీస్​ ముందుకొస్తున్నాయంటే ఇక బీటౌన్‌లోనే కాదు యావత్​ సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇంకెలా ఉంటుంది. వింటుంటేనే ఆసక్తికరంగా ఉంది కదూ. ప్రస్తుతం ఈ విషయంపైనే బాలీవుడ్​లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయట.

Tiger vs Pathaan Movie Cast :షారుక్‌, సల్మాన్​కు ఈ కథను వినిపించగా.. దానికి ఈ ఇద్దరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి ఓ టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మల్టీ స్టారర్‌కు 'వార్​' డైరెక్టర్​ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్నారట. భారీ బడ్జెట్​తో రూపొందనున్న ఈ సినిమాకు 'టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌' అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Shahrukh Salman Movies : ఇక షారుక్​ సల్మాన్​ కలిసి మొదటి సారి 1995లో 'కరణ్‌ అర్జున్‌' అనే చిత్రంలో నటించారు. హీరో హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేష్‌ రోషన్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1998లో షారుక్ నటించిన 'కుచ్​ కుచ్​ హోతా హై' సినిమాలో సల్మాన్​ అతిథి పాత్రలో కనిపించారు. రీసెంట్​గా షారుక్ 'పఠాన్'​ సినిమా క్లైమాక్స్​లో సల్మాన్​ కనిపించారు. మళ్లీ దాదాపు 28ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై ఫుల్​ లెంగ్త్​ రోల్స్​లో నటించనున్నారు.

Shahurkh Khan Movies : ఇక తాజాగా 'జవాన్‌'తో సూపర్‌ హిట్‌ను అందుకున్న షారుక్‌.. ప్రస్తుతం రాజ్​ కుమార్​ హిరాణీ తెరకెక్కిస్తున్న 'డుంకీ' మూవీలో లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ 3' సినిమాలో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఇది విడుదల కానుంది.

Shahrukh Khan Bald Look : 'జవాన్​'లో షారుక్​ అందుకే 'గుండు'తో కనిపించారట.. రెమ్యునరేషన్​గా దీపిక ఒక్క రూపాయి కూడా..

Salman Khan Vishnu Vardhan : పవన్​ కల్యాణ్​ డైరెక్టర్​తో సల్మాన్​ ఖాన్ కొత్త సినిమా.. మూవీ బ్యాక్​డ్రాప్​ ఇదే!

ABOUT THE AUTHOR

...view details