Tiger Nageswarao Rao Theatres :మరో ఏడు రోజుల్లో మాస్ మాహారాజా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడానికి ప్రమోషన్ల కోసం రవితేజ సౌత్ టు నార్త్ అన్ని ప్రధాన నగరాలు తిరిగేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కానీ ఈ సినిమాకు తమిళంలో, కన్నడంలో కనీస థియేటర్లు కూడా దొరకకపోవడం బాధాకరమని ఫ్యాన్స్ ఆందోళ చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
19నే తమిళంలో దళపతి విజయ్ నటించిన లియో, కన్నడంలో సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన ఘోస్ట్ విడుదల కారణంగా ఈ చిత్రాలకే స్క్రీన్స్ లాక్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సొంత భాష చిత్రాలు కాబట్టి.. మన సినిమాలకు స్క్రీన్స్ - థియేటర్లు దొరకట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి అదే సమయంలో వారి చిత్రాలు కూడా ఇక్కడ విడుదల అవుతున్నాయి. ఈ దసరాకైతే బాలయ్య భగవంత్ కేసరి - రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ చిత్రం లియో, కన్నడ చిత్రం ఘోస్ట్‌కు మంచిగానే స్క్రీన్స్ దొరికాయని టాక్! మరి వారికి ఎలాగా మన దగ్గర చెప్పుకోదగ్గ స్క్రీన్స్, థియేటర్లు దొరుకున్నాయన్నది ప్రశ్న. అది కూడా ఇంత భారీ బక్సాఫీస్ పోటీలోనూ..
అంటే మనం మాత్రమే స్ట్రెట్ - డబ్బింగ్ అని తేడా లేకుండా అందరినీ ఆదరిస్తున్నామా? మరి వారు ఎందుకు అలా చేయడం లేదు అంటూ ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అసలు టైగర్ నాగేశ్వరరావుకు అక్కడ హైప్ లేక ఇలా చేస్తున్నారా? లేదంటే కావాలనే మన - తన భేదం చూపిస్తున్నారా? అనేది వారికే తెలియాలి. చూడాలి మరి ఈ సమస్య ఎలా, ఎప్పుడు తొలిగిపోతుందో...