Tiger Nageswara Rao Opening Collections :మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా శుక్రవారం(అక్టోబర్ 20) థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి షో నుంచే డిసెంట్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రానికి తెలుగులో 53.18 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీని వచ్చినట్లు తెలుస్తోంది. నైట్ షోలలో 69.72 శాతం ఆక్యుపెన్సీ, మార్నింగ్ షోలలో 49.46శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 360షోలు వేయగా 56.5% ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఓపెనింగ్ డే రూ. 5.50 కోట్ల షేర్.. ఇండియా వైడ్‌గా అన్నీ భాషల్లో రూ.8కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి పోటీగా ఒకరోజు ముందుగా రిలీజైన బాలయ్య భగవంత్ కేసరికి రూ.14.36కోట్లు, దళపతి విజయ్ రూ.8.31కోట్లకు పైగా వచ్చాయి.
కాగా, రవితేజ కెరీర్లో ఇదే బిగ్ ఓపెనింగ్స్. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే.. రెండోది. రావణాసుర రూ.4.29కోట్లు, ధమాకా రూ.4.66కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ.2.82కోట్లు, ఖిలాడీ రూ.4.30కోట్లు, క్రాక్ రూ.6.25కోట్లు, డిస్కో రాజా రూ.2.54కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని రూ.3.40కోట్లు వసూలు చేశాయి. అంటే వీటిలో క్రాక్ మూవీ భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది.