Tiger Nageswara Rao Day 2 Collections :ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ప్రతి హీరో తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకునే పనిలోనే ఉన్నారు. తమ సినిమాలను మరింత మందికి చేరేలా లార్జ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. బడా హీరోలు.. అచ్చం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అలా ఇప్పుడు తొలిసారి పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టారు మాస్ మహారాజా రవితేజ. తాజాగా టైగర్ నాగేశ్వరరావుతో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డీసెంట్ టాక్ అందుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మంచిగా రాగా.. రెండో రోజు కూడా మంచిగానే వసూళ్లు వచ్చాయి. రెండో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 25.91 శాతం.. మధ్యాహ్నం ఆక్యూపెన్సీ 43.22శాతం, ఈవెనింగ్ ఆక్యూపెన్సీ 39.01 శాతం, నైట్ ఆక్యూపెన్సీ 59.04 శాతం నమోదయ్యాయట.
కలెక్షన్స్ వివరాల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఓపెనింగ్ డే రూ. 5.50 కోట్ల షేర్.. ఇండియా వైడ్‌గా అన్నీ భాషల్లో రూ.8కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలిసింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌కు చేరువగా వచ్చింది. ఇండియావైడ్‌గా అన్నీ భాషల్లో కలిపి తొలి రోజు రూ.8కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.4.75కోట్ల నెట్ అందుకుందట. అంటే 12.75కోట్లు నెట్ వచ్చాయన్న మాట. అదే బాలయ్య భగవంత్ కేసరి కేవలం రెండో రోజుల్లో రూ.20కోట్లకు పైగా షేర్ వసూళ్లను అందుకుంది.