Tiger 3 Vs Naal 2 Movie :బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్-3'. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా నటించిన చిత్రం ఇది. YRF Spy Universe నుంచి రానున్న చిత్రం కావడం వల్ల 'టైగర్-3'పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే 'టైగర్-3'కి పోటీగా తమిళ సినిమాలు 'జపాన్', 'జిగర్ తండా డబుల్ ఎక్స్' నవంబర్ 10న విడుదల కానున్నాయి. టాలీవుడ్ నుంచి మాత్రం ఈ వీకెండ్లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కానప్పటికీ.. ఓ తెలుగు డైరెక్టర్ తీసిన మరాఠీ సినిమా 'నాళ్-భాగ్ 2'.. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ 'టైగర్-3' ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది.
లక్షన్నర బుకింగ్స్.. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న 'టైగర్-3'కి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. సుమారు లక్షన్నర ప్రీ-బుకింగ్స్ కూడా జరిగినట్లు తెలిసింది. అయితే సల్మాన్ ఖాన్ 'టైగర్-3' మూవీకి ఏ స్థాయిలో హైప్ క్రియేటైందో తెలిసిందే. అయినప్పటికీ.. ఏకంగా బడా హీరో సినిమాకే సవాల్ విసురుతోంది 'నాళ్-భాగ్ 2'.
తెలుగోడి మరాఠీ మూవీ..2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్‌గా 'నాళ్-భాగ్ 2'ని తెరకెక్కించారు. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ సుధాకర్ రెడ్డి ఎక్కంటి దర్శకత్వం వహించారు. ఆయనది అంధ్రప్రదేశ్ గుంటురు జిల్లా. సుధాకర్ రెడ్డి ఇదివరకు తెలుగులో 'పౌరుడు', 'మనసారా', 'మధుమాసం', 'కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు', 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఇక 'నాళ్' సినిమా (మరాఠి)తో మెగాఫోన్ చేతపట్టారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డును కూడా అందుకున్నారు సుధాకర్ ఎక్కంటి.
విమర్శకులు సైతం ప్రశంసించేలా 'నాళ్' పార్ట్ 1 ను తెరకెక్కించారు సుధాకర్ రెడ్డి ఎక్కంటి. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా.. సుధాకర్ రెడ్డి 'నాళ్-2' తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ -స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. 'నాళ్' మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడం వల్ల.. 'నాళ్-2' కు మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు సపోర్ట్‌గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. సింగిల్ స్క్రీన్లలో సైతం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక 'టైగర్-3'కి టికెట్స్ ఇప్పటికే బుక్ అయినా సరే.. జీ సంస్థ తన వంతుగా కొన్ని బుకింగ్స్‌ను 'నాళ్-2' కోసం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందట.
8000 మందితో సినిమా షూటింగ్ - భారతీయుడి కోసం శంకర్ భారీ ప్లాన్!
'ఆరోగ్యం దెబ్బతింది, సినిమాలు ఫ్లాప్, విడాకుల సమస్య'- సమంత ఎమోషనల్