Tiger 3 Trailer Katrina Bath Towel Fight : యాక్షన్ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఫైట్ సీక్వెన్స్‌లు, కత్రినా బాత్ టవల్ ఫైట్ సీన్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కత్రినా బోల్డ్ టవల్ ఫైట్ సీక్వెన్స్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది.
సినిమాలో కత్రినా కైఫ్ జోయా అనే పాత్రలో కనిపించింది. ట్రైలర్లో పలు యక్షన్ సీన్స్‌లో ఫైటింగ్ చేస్తూ, అలానే ఫ్యామిలీ సీన్స్‌లో ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ చివర్లో 5 సెకన్ల పాటు వచ్చిన కత్రిన టవల్ ఫైట్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో బాత్ టవల్స్ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్‌ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్‌గా తమ నేక్డ్ బాడీని కవర్ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్... సినిమాపై ఒక్కసారిగా మరింత స్పెషల్ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసి నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
దీంతో ఈ సీన్స్‌ను చూసిన నెటిజన్లు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. కత్రిన సీన్ కోసమైనా సినిమాను బిగ్ స్క్రీన్‌పై తప్పకుండా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. 'సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై అందరి దృష్టి పడటానికి, తన బాడీని మేకప్ చేసుకోవడానికి నెలల తరబడి కష్టపడ్డాడు. కానీ కత్రినా సింపుల్‌గా ఒక్క టవల్ సీన్‌తోనే అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుందిగా', 'ఈ ఒక్క సీన్ టైగర్ 3కి రూ.1000కోట్లు పక్కా' అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది రణ్‌బీర్ కపూర్ ఐకానిక్ టవల్ సీన్‌ను కత్రిన కాపీ చేసిందిగా' అని చెబుతున్నారు.