This Week Release Movies : 2023 మరో కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నెలలో భారీగానే సినిమాలు విడుదలయ్యాయి. క్రిస్మస్ పండుగకు సలార్, డంకీ వంటి భారీ చిత్రాలు థియేటర్లో సందడి చేశాయి. అయితే సలార్ హవా ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ ఏడాది చివరి వారంలో థియేటర్లతోపాటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేంటో చూద్దాం.
బ్రిటిష్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం డెవిల్. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మేనన్, మాళవిక నాయర్ నటించారు. బ్రిటిష్ రహస్య గూఢచారిగా కల్యాణ్‌రామ్ కనిపించనున్నారు. మూవీలోని విజువల్స్ వేరే లెవల్లో ఉంటాయని టాక్.
బబుల్‌గమ్ లవ్ స్టోరీ
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, తెలుగు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ బబుల్ గమ్. రవికాంత్ పేరెపు దర్శకుడు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
"ఈ చిత్రానికి ప్రతిభావంతులైన యువ బృందం పని చేసింది. రోషన్, మానస చాలా గ్రేస్‌తో ఈ పాత్రల్ని పోషించారు. వారు తమ పాత్రల్ని అర్థం చేసుకున్న తీరు నన్ను చాలా సర్‌ప్రైజ్ చేసింది" అని చిత్ర బృందం చెబుతోంది.