ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్.. మెగాఅల్లు ఫ్యాన్స్‌కు తీపికబురు వినిపించిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్-అల్లుఅర్జున్‌తో ఓ మల్టీస్టారర్ చేయాలని, దానికి చరణ్-అర్జున్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు.. తన మనసులోని మాటను బయటపెట్టారు. సరైన కథ, దర్శకుడు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలుస్తోంది. అల్లుఅరవింద్ ప్రస్తుతం ఆ పనిమీదే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ను లైన్లో పెట్టారని తెలిసింది. ఆయనతో చర్చలు జరుపుతున్నారట.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో 'ఎస్ఎస్ఎమ్బీ 28' చేస్తున్నారు. ఇది పూర్తవ్వగానే అల్లుఅర్జున్‌తో చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ కథనే మల్టీస్టారర్‌గా డెవలప్ చేయాలని అల్లుఅరవింద్ అడిగినట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికార ప్రకటన లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే.