మొదటి నుంచి విభిన్న చిత్రాలు, కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అడవి శేష్. ఇప్పుడు 'మేజర్'తో థియేటర్‌లలో సందడి చేసేందుకు వస్తున్నారు. 26/11 ఉగ్రదాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అతికొద్ది మందికోసం ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.
సింహం.. పులి.. చిరుత.. ప్రకృతి
విలక్షణ నటులందరినీ ఒకే తెరపై చూపించటం అంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే దానికి తగినట్లు కథ, పాత్రల్లో బలం లేకపోతే సినిమా తేలిపోతుంది. కానీ, తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఆ అడ్వెంచర్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. సూర్య అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు. ఇందులో సింహం(విజయ్ సేతుపతి) పులి(ఫహద్ ఫాజిల్) చిరుత(?) మధ్య జరిగిన ఘర్షణ ఏంటి? అందులో ప్రకృతి(కమల్‌హాసన్) సృష్టించిన ప్రళయం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
పృధ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ
అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో మానుషి కథానాయికగా రూపొందుతున్న చిత్రం 'సమ్రాట్ పృధ్వీరాజ్'. చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు.. పలు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. రాజ్‌పూత్ యోధుడు పృధ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా తీసిన ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సంజయ్‌దత్, సోనూసూద్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!
థియేటర్‌లో అలరించి..