Adi pinnishetty The warrior movie: పెళ్లికి ముందు ది వారియర్ సినిమా విడుదలైతే హీరోయిన్ నిక్కీ తనను పెళ్లి చేసుకునేది కాదని యువ కథానాయకుడు ఆది పిన్నిశెట్టి చమత్కరించారు. ఆ చిత్రం పెళ్లి తర్వాత విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. రామ్ పోతినేని కథానాయకుడిగా ఆది ప్రతినాయకుడిగా నటించిన ది వారియర్ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. రామ్‌తో పాటు గురు పాత్రలో నటించిన ఆదిపిన్నిశెట్టి విమర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆది.... కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రలకే కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఈ విషయంలో తనకు కమలహాసన్ చెప్పే మాటలు స్ఫూర్తిగా నిలుస్తాయంటోన్న ఆది... ది వారియర్ చూసి తన శ్రీమతి నిక్కీతోపాటు తండ్రి రవిరాజా పిన్నిశెట్టి ఎంతో హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.
'వారియర్ అప్పుడు విడుదలైతే.. నిక్కీతో పెళ్లయ్యేదే కాదు'
Adi pinnishetty The warrior movie: కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రలకే కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన కోరిక అని కథానాయకుడు ఆది పినిశెట్టి అన్నారు. పెళ్లికి ముందు ది వారియర్ సినిమా విడుదలైతే హీరోయిన్ నిక్కీ తనను పెళ్లి చేసుకునేది కాదని పేర్కొన్నారు.
"అజ్ఞాతవాసి తర్వాతా చాలా సినిమాలో విలన్ రోల్స్ వచ్చాయి. సరైనోడు తర్వాత చేసే ప్రతినాయకుడి పాత్ర చాలా బాగుండాలని భావించాను. చాలా కథలను విన్నాను. ది వారియర్ బాగా నచ్చింది. ఈ పాత్రను బాగా తీర్చిదిద్దారు. సినిమా చూసి నా రోల్‌కు సంబంధించి కొన్ని సీన్స్‌లో మరింత బాగా నటించొచ్చని మా నాన్నగారు అన్నారు. కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రలకే కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. ఈ విషయంలో కమల్‌హాసన్ నాకు స్ఫూర్తి. హీరో రామ్ మంచి మనసున్న వ్యక్తి. ఓ నటుడిగా అతడు బాగా యాక్టింగ్ చేయగలడు. ఓవర్‌గా చేయడు. మరో రెండు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతున్నాను" అని ఆది పేర్కొన్నారు.
ఇద చూడండి: సల్మాన్ అలా అడిగితే నో చెప్పలేను: పాక్ నటి