తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

The Kerala Story Ormax Rating : పఠాన్​కు షాకిచ్చిన 'ది కేరళ స్టోరీ'.. ఆ లిస్ట్​లో సెకండ్​ ప్లేస్​.. మరి టాప్​లో? - The Kerala Storyupdates

The Kerala Story Ormax Rating : బాలీవుడ్​ హిట్​ చిత్రాలు పఠాన్​, గదర్​-2 చిత్రాలకు ది కేరళ స్టోరీ సినిమా షాకిచ్చింది! 2023లో థియేట్రికల్​గా ఎక్కవ క్రేజ్​ ఉన్న చిత్రాల్లో జవాన్​ తొలి స్థానంలో ఉండగా.. ది కేరళ స్టోరీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

The Kerala Story Ormax Rating
The Kerala Story Ormax Rating

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 1:56 PM IST

The Kerala Story Ormax Rating :బాక్సాఫీస్​ వద్ద ఒక సినిమా కోట్ల రూపాయలు వసూళ్లు సాధించడమంటే మాటలు కాదు. ఎంత స్టార్​ హీరోల చిత్రాలైనా కొన్నిసార్లు నిరాశపరిస్తుంటాయి. భారీ బడ్జెట్​తో చిత్రాలు తెరకెక్కించినప్పుటికీ హిట్​ టాక్​ సంపాదించకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్​లో చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే హిట్​గా నిలిచాయి. అయితే 2023లో థియేట్రికల్​గా ఎక్కువ క్రేజ్​ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది.

మరి.. రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా నటి ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా ఇటీవలే రిలీజ్ చేసింది.

ఆయా చిత్రాల వసూళ్లు ఇలా..
బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది.

1500 శాతం లాభాలతో..
అయితే కేవలం రూ.20 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన పాన్​ఇండియా మూవీ 'కేరళ స్టోరీ' ..బాక్సాఫీస్ వద్ద అత్యధిక లాభాలను అర్జించి రికార్డుకెక్కింది. ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 303 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా గ్లోబల్ నెట్ హాల్ కూడా రూ. 250 కోట్లకు పైగా దాటింది. ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే 1500% పైగా లాభాన్ని అర్జించింది.

ABOUT THE AUTHOR

...view details