తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కశ్మీర్​ ఫైల్స్​' ఓటీటీ డేట్ ఫిక్స్.. సూర్య సినిమా రీమేక్​లో అక్షయ్ - బిగ్​బాస్​ ఫేమ్​ సన్నీ వెబ్​ సిరీస్​

Movie Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రం ఓటీటీ రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు, బాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు అక్ష‌య్‌కుమార్ కొత్త సినిమా షూటింగ్​ మొదలైంది. సూర్య నటించిన త‌మిళ చిత్రం 'సూరారై పొట్రు' హిందీ రీమేక్​లో ఆయన హీరోగా నటిస్తున్నారు.

MOVIE UPDATES
MOVIE UPDATES

By

Published : Apr 25, 2022, 5:16 PM IST

The Kashmir Files OTT Release Date: చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకుంది 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. 30 ఏళ్ల క్రితం కశ్మీరీ పండితులు పడిన బాధలను కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనమైంది. విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లను రికార్డు స్థాయిలో రాబట్టింది. అలాంటి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం శుభవార్తను వినిపించింది.

Zee 5 OTT: మే 13 నుంచి ఈ సినిమా 'జీ 5'లో స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.

Suriya AkshayKumar Remake Shooting: సూర్య హీరోగా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం 'సూరారై పొట్రు' విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌ల‌ను సైతం అందుకుంది. ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో సూర్య న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. కొవిడ్ కార‌ణంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌లైన చిత్రం ప‌లు అవార్డుల‌ను అందుకుంది. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైంది. ఈ సినిమా అక్ష‌య్ కుమార్ హీరోగా బాలీవుడ్​లో రీమేక్ కాబోతుంది.

హిందీ వెర్ష‌న్​కు కూడా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమాతో నిర్మాత‌గా సూర్య హిందీ చిత్ర‌సీమ‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. సోమ‌వారం ఈ రీమేక్ షూటింగ్ ప్రారంభ‌మైంది. తొలి షాట్​ను చిత్రీక‌రించ‌డానికి ముందు హీరోయిన్ రాధికామ‌ద‌న్ కొబ్బరికాయ కొడుతున్న వీడియోను అక్ష‌య్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. కొత్త సినిమా షూటింగ్​ను మొద‌లుపెట్టామ‌ని, ఈ సినిమాకు మంచి టైటిల్‌ను సూచించ‌మ‌ని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. అక్ష‌య్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఆక‌ట్టుకుంటోంది. సూర్య కూడా కొత్త ప్ర‌యాణానికి మీ అంద‌రి అశీర్వాదం కావాలంటూ అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

Jayamma Panchayathi Golusu Kattu Gosalu Song: సుమ కనకాల, దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం మే 6న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం 'జయమ్మ పంచాయితీ'లోని 'గొలుసు కట్టు గోసలు' లిరికల్ వీడియోను విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా కీరవాణి సంగీత సారథ్యంలో చారు హరిహరన్ ఆలపించారు. కథలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ పాట ఆద్యంతం భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా ఉంది. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాలను, ఆ పాత్రలోని భావోద్వేగాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు

యూట్యూబ్​లో దూసుకుపోతున్న 'ది వారియర్​' బుల్లెట్​ సాంగ్​
డా. శివరాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'గోస్ట్​' కాన్సెప్ట్​ పోస్టర్
బిగ్‌బాస్‌ ఫేమ్​ వీజే సన్నీ, దివిల 'ఏటీఎం' వెబ్​ సిరీస్​ షూటింగ్​ ప్రారంభం

ఇవీ చదవండి:చరణ్​ తొలి సినిమాకు.. ఇప్పటికి తేడా అదే: చిరు

పవన్​ సినిమాలో రవీనా​.. 'సలార్​' ఛేజింగ్​ సీన్​.. మహేశ్​తో శ్రీలీల!

ABOUT THE AUTHOR

...view details