The Blair Witch Project Total Collection : సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు.. భారీ కలెక్షన్లను అందుకోవడం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. కానీ చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాల్సిందే. అలా ప్రత్యేకత ఉన్న తక్కువ బడ్జెట్ చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపించడం అరుదుగా చూస్తుంటాం. అలా ఓ చిత్రం రూ.50లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి.. ఏకంగా రూ.2,000 వేల కోట్ల వసూళ్లను సాధించిందని తెలుసా?
Box Office Collection Of The Blair Witch Project : ఆ చిత్రం ఏంటంటే.. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1999లో సూపర్ నేచురల్ హార్ర్ ఫిల్మ్‌గా రూపొందిన చిత్రం 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్'(The Blair Witch Project). ఈ చిత్రాన్ని దర్శకద్వయం డేనియల్ మైరిక్, ఎడ్వార్డో సాంచేజ్ తెరకెక్కించారు. మొదట ఈ చిత్రానికి 'ది బ్లాక్ హిల్స్ ప్రాజెక్ట్' అనే టైటిల్‌ను పెట్టారు. కానీ ఆ తర్వాత 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్'గా మార్చారు. ఫైనల్‌గా దాన్నే ఖరారు చేశారు. 1999 జనవరి 23న సండెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలై 14న న్యూయార్క్‌లో విడుదల చేశారు. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జులై 30న అమెరికవ్యాప్తంగా విడుదల చేయగా.. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కంటెంట్ మ్యాజిక్ చేయడంతో ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. దాదాపు రూ. 50 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రానికి.. హాలీవుడ్ ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం వల్ల.. రికార్డు కలెక్షన్లను అందుకుంది. లాంగ్ రన్ టైమ్‌లో రూ. 2074 కోట్ల రూపాయలను సాధించి ప్రభంజనం సృష్టించిందని బయట ఇంగ్లీష్ కథనాలు ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో కూడా అందుబాటులో ఉందని తెలిసింది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందట. చూడండి వీలైతే..