Thank God Movie : బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన కొత్త చిత్రం 'థ్యాంక్ గాడ్'. అయితే ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లోని కొన్ని సంభాషణలు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ లాయర్ హిమాన్షు శ్రీవాత్సవ.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది.
"అజయ్ దేవ్‌గణ్ సూటు వేసుకుని, చిత్ర గుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశారు. చిత్ర గుప్తుడు అంటే పాప కర్మలు లెక్కించేవారు. మనుషుల మంచి చెడులను రికార్డు చేస్తారు. దేవుళ్లను అలా చూపిస్తే.. అది మతం మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది" అని హిమాన్షు తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటినషనర్ స్టేట్మెంట్ను కోర్టు నవంబర్ 18న రికార్డు చేయనుంది.