తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Thangalam Teaser : విక్రమ్​ ఇంత వైల్డ్​గా ఉన్నాడేంట్రా.. పామును చేత్తోనే రెండు ముక్కలు చేసి.. - భయంకరంగా తంగలాన్ టీజర్

Thangalam Teaser : కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తంగలాన్​'. తాజాగా ఈ టీజర్​ రిలీజై.. ఓ వైపు ఆసక్తి పెంచుతూనే మరోవైపు వైల్డ్​గా కనిపిస్తోంది.

Thangalam Teaser : విక్రమ్​ ఇంత వైల్డ్​గా ఉన్నాడేంట్రా.. పామును చేత్తోనే రెండు ముక్కలు చేసి..
Thangalam Teaser : విక్రమ్​ ఇంత వైల్డ్​గా ఉన్నాడేంట్రా.. పామును చేత్తోనే రెండు ముక్కలు చేసి..

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 12:46 PM IST

Updated : Nov 1, 2023, 2:23 PM IST

Thangalam Teaser :ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు చియాన్ విక్రమ్. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్​ 'తంగలాన్​'. పా.రంజిత్‌ ఈ సినిమాను రా అండ్ రస్టిక్​గా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్​ రిలీజై ఓ వైపు ఆసక్తి పెంచుతూనే మరోవైపు వైల్డ్​గా కనిపిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.

ఈ ప్రచార చిత్రంలో బంగారు గనుల దగ్గర ఉండే గ్రామాల్లోని మనుషులు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలను అతీ భయంకరంగా చిత్రీకరించారు. ముఖ్యంగా విక్రమ్​ను మరింత భయంకరంగా వైల్డ్​గా చూపించారు. కత్తి పట్టుకొని ఎదురొచ్చే వాళ్లని నరికేస్తూ ఉంటారు విక్రమ్. ఓ సందర్భంలో చేత్తోనే పామును రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు కూడా చూపించారు. ఫైనల్​గా బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా టీజర్​ను కట్​ చేశారు.

కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ తన నటన, గెటప్​తో అదరగొట్టేశారు. విక్రమ్ లుక్స్​, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రచార చిత్రాన్ని బాగా హైలైట్ చేశాయి. ప్రచార చిత్రం చివర్లో.. రక్తపాతం జరిగే యుద్ధాలతో స్వేచ్ఛ లభిస్తుంది. సన్​ ఆఫ్ గోల్డ్​ ఉదయిస్తున్నాడు అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చారు. ఒక్క డైలాగ్ కూడా లేని ఈ టీజర్​ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచేసింది. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Thangalam Release Date :ఇకపోతే ఈ సినిమాలో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్‌, నీలం ప్రొడక్షన్‌ సంస్థల బ్యానర్​పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్​ చేయడానికి మూవీటీమ్​ సన్నాహాలు చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.

'దేవర'లో జాన్వీ కపూర్​ రామలక్ష్మీ శ్రీవల్లీలా ఫేమస్​ అవుతుందా?

Adikeshava Mangalavaram Movie : శ్రీలీల కన్నా​.. పాయల్ సినిమాకే ఎక్కువ బిజినెస్​!

Last Updated : Nov 1, 2023, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details