తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గురి తప్పేదేలేదెస్ అంటున్న చైతూ - ఏలియన్​తో శివ కార్తికేయన్ ఫ్రెండ్​షిప్​ - Thandel movie chaitanya

Thandel Glimpse : స్టార్ హీరో నాగచైతన్య లీడ్ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'తండేల్​'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​ విడుదలైంది. మరోవైపు శివకార్తికేయన్​ తాజా మూవీ అయాలాన్​ ట్రైలర్​ కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఆ విశేషాలు మీ కోసం.

Thandel Glimpse
Thandel Glimpse

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 12:05 PM IST

Updated : Jan 6, 2024, 2:12 PM IST

Thandel Glimpse :టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'తండేల్​'. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ గ్లింప్స్​ విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్​ ఆ వీడియోను నెట్టింట అప్​లోడ్​ చేశారు. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో చైతూ లుక్​తో పాటు యాక్షన్ అదిరిందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.

బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే ఓ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతడు పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సన్నివేశాలను చూపించారు. చివర్లో సాయిపల్లవిని అలా చూపించి టీజర్‌ని ముగించారు.

తండేల్ మూవీలో బలమైన లవ్ స్టొరీని కూడా డైరెక్టర్ చందూ మొండేటి చూపించనున్నారు. ఈ సినిమాకి కార్తిక్ స్టోరీని అందించారు. అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బతుకుదెరువు కోసం గుజరాత్​లోని వీరవల్​కు వెళ్లిన హీరో వేట సమయంలో చేస్తూ పాకిస్థాన్ కోస్టు గార్డులకు చిక్కుతాడు. దీంతో అతడితో పాటు అక్కడున్న వారందరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టేస్తారు పాకిస్థాన్ పోలీసులు. ఆ తర్వాత జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది తండేల్ స్టోరీ. దేశభక్తి ఓ అందమైన ప్రేమ కథను జత చేసి ఈ సినిమాను కమర్షియల్​గా రూపొందిస్తున్నారు.

Ayalaan Trailer : మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌, రకుల్​ ప్రీత్ సింగ్​ కాంబోలో వచ్చిన మూవీ 'అయలాన్‌'. గ్రహాంతర వాసి నేపథ్యంతో, భారీ విజువల్స్‌తో రవి కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్​ను మూవీ టీమ్​ విడుదల చేసింది. శివకార్తికేయన్‌ నటన, డైలాగ్స్‌ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

నాగ చైతన్య 'తండేల్​' గ్రాండ్ లాంఛ్​ - స్పెషల్ అట్రాక్షన్​గా సాయి పల్లవి!

'ఆ సినిమాల్లో నేను అస్సలు నటించను - దానికి మైనస్‌ నేనే'

Last Updated : Jan 6, 2024, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details